నా కోరిక ఇదే అంటూ మోడీ ఎమోషనల్ ట్వీట్..!  

modis emotional tweet saying this is my wish Narendra Modi, Trump, Ahmedabad, Motera Stadium, Social Distance, Masks, Trump India Tour - Telugu @realdonaldtrump, Donald Trump, Happy Birthday, Mask, Narendra Modi, Narendramodi, Social Distance

నిన్న భార‌త ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర ‌మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయనకు శుభాకాంక్ష‌లు మిన్నంటాయి.దేశాధి నేతలు, ప్ర‌జ‌ల‌తో పాటుగా ప్ర‌పంచ ‌వ్యాప్తంగా ఉన్న దేశాధి నేత‌లు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు ద్వారా ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియజేసారు.

TeluguStop.com - Modis Emotional Tweet Saying This Is My Wish

ఈ క్రమంలోనే, తాజాగా.అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ న‌రేంద్ర మోడీకి బ‌ర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మోడీకి ట్రంప్ కు మధ్య ఉన్న సాన్నిత్యం గురించి అందరికీ తెలిసినదే.

TeluguStop.com - నా కోరిక ఇదే అంటూ మోడీ ఎమోషనల్ ట్వీట్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా.

ఫిబ్ర‌వ‌రిలో ఇండియా టూర్‌ కు సంబంధించి అహ్మ‌దాబాద్‌ లోని మోతేరా స్టేడియంలో జ‌రిగిన కార్యక్రమంలో దిగిన ఫోటోను ట్రంప్ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.ఇకపోతే.

తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నరేంద్ర మోడీ తన వైపునిండి ధన్యవాదాలు తెలిపారు.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్ర‌తీ ఒక్క‌రు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాల‌ని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మోడీని చాలా మంది పుట్టిన రోజు నాడు ఎలాంటి కానుక కావాలని అడిగారంటూ తెలియజేశారు.దీనికి బదులుగా ఆయన “ఇప్పుడు నాకు కావలసింది ఒకే ఒక్కటి.

ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్‌ లు ఖచ్చితంగా ధరించండి.అలాగే సామాజిక దూరాన్ని పాటించండి.

రద్దీ ప్రదేశాలకూ ససేమిరా వెళ్ల‌కండి.మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

రోగ నిరోధక శక్తిని మరింత పెంచుకోండి.మొత్తంగా. మన భూ గ్రహాన్ని ఆరోగ్యంగా తయారు చేద్దాం.” అని కోరారు.

కాగా. న‌రేంద్ర ‌మోడీ నిన్న గురువారం నాటికి 70వ వసంతంలోకి అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి హృదయ పూర్వకమైన ఆకాంక్షలను అందుకున్న మోడీ “నన్ను పలకరించిన ప్రతి వ్యక్తికి నేను కృతజ్ఞుడిని. ఈ అభినందనలు నా తోటి పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సేవ చేసేందుకు నాకు మరింత శక్తినిస్తాయి.” అని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు.

#Mask #Social Distance #Narendra Modi #Narendramodi #Donald Trump

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Modis Emotional Tweet Saying This Is My Wish Related Telugu News,Photos/Pics,Images..