ఈ సారి కూడా మోడీ చక్రం తిప్పుతాడా! రాహుల్ బలమెంత

ప్రాంతీయ రాజకీయాలు ఎలా ఉన్నా దేశ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ లదే హవా, ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చిన అవి వాటి ప్రభావాన్ని చూపించాలేకపోయాయి.అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని అనుకుంటున్నా బీజేపీ పార్టీ, మోడీకి ఈ సారి ప్రాంతీయ పార్టీలలో చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నాయి.

 Modi Will Gain People Intention Again-TeluguStop.com

ప్రాంతీయ పార్టీల కూటమితో కలిసి దేశ రాజకీయాలని ఏలిన బీజేపీ ఇప్పుడు ఒంటరిగానే తమ సత్తా చూపించి గత ఎన్నికలలో తెచ్చుకున్న భారీ మెజార్టీని మళ్ళీ తెచ్చుకోవాలని భావిస్తుంది.

అయితే ఈ ఐదేళ్ళ మోడీ పరిపాలనలో ప్రజలు అంత సంతృప్తిగా ఏమీ లేరనే చెప్పాలి.

మోడీ ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, విధానపరమైన నిర్ణయాలతో పాటు, హిందుత్వ ఆలోచనలతో, దేశంలో హిందుత్వ సంస్థల దాడులు ఎక్కువైపోయాయి.ఓ విధంగా చీప్పాలంటే హిందుత్వ వాదం అనేది ఎన్నడూ లేననతగా దేశంలో చొచ్చుకుపోయి, ఇండియాలో ఉండి కూడా మేము దేశ భక్తి చూపించుకోవాలా అనే ప్రశ్నలు చాలా మందికి వచ్చాయి.

హిదుత్వ బావజాలం అంతగా ప్రజలని భయపెట్టింది.

అయితే దేశ భద్రత విషయంలో మోడీ రాజీలేని విధానాలు, అలాగే దేశీయ మార్కెట్ ని అభివృద్ధి చేసే విధంగా మేక్ ఇన్ ఇండియా వంటి సంష్కరణలు యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి.

అలాగే ఒకప్పుడు ఉగ్రవాద దాడులు దేశం మధ్యలోనే జరిగేవి.అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఉగ్రవాదులు సరిహద్దులు ధాటి రాలేని పరిస్థితి.

దీంతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి పాల్పడి దేశ భద్రతని అస్థిరపరిచే ప్రయత్నం చేసిన మోడీ ఆలోచనతో వాటిని సమర్దవంతంగా తిప్పి కొట్టారు.దేశ రక్షణ వ్యవస్థకి పూర్తి స్వేచ్చ ఇచ్చి తన నిర్ణయంతో సంబంధం లేకుండా ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని స్వేచ్చ ఇవ్వడంతో భారత రక్షణ శాఖ చాలా బలంగా పనిచేస్తుంది.

ఇవన్ని మళ్ళీ మోడీని అధికారంలో ఎందుకు తీసుకురాకూడదు అనే ఆలోచన ప్రజల్లో వచ్చేలా చేసాయి.ఇక మోడీ ఆలోచనల వెనుక దేశ ఆర్ధిక అభివృద్ధి, గుణాత్మక మార్పులు లక్ష్యంగా, ప్రపంచంలో భారత్ బలమైన దేశంగా గుర్తింపు తీసుకురావాలనే సంకల్పం దేశ ప్రజలకి కనిపిస్తుంది.ఈ కారణంగానే దేశ ప్రజలు మళ్ళీ మోడీకి పట్టం కట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపం, రాహుల్ లో అపరిపక్వత కూడా మోడీకి లాభం చేకూర్చేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube