ఏపీలో మోదీ పర్యటన ! ఆ ఆధారాలతో రాబోతున్నాడా ...?

ఏపీ సీఎం చంద్రబాబు – ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఉప్పు – నిప్పులా ఉన్న రాజకీయ వైరం ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ మరింత ముదురుతోంది.ఒకరి మీద మరొకరు ఎత్తులు … పై ఎత్తులు వేసుకుంటూ… రాజకీయ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Modi Tour In Andhra Pradesh About Ap Elections Campaign-TeluguStop.com

అంతే కాకుండా…గత కొద్దిరోజులగా విభజన హామీల అమలు విషయంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.ప్రస్తుతం మోదీ రేపు గుంటూరు సభకు వస్తున్న తరుణంలో మోదీ ఏం మాట్లాడబోతున్నారో … బాబు పై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయబోతున్నారో అనే ఉత్కంఠ ఇరు పార్టీల్లో పెరిగింది.అందుకే… బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ సభను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది.

ఇక ఏపీలో మోదీ పర్యటనను పరిగణలోకి తీసుకుంటే….ఆయన ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరు నగరానికి చేరుకుంటారు.ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.ఆ తర్వాత సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఈ పర్యటనలో విశాఖలో 1,178.35 కోట్లతో ఏర్పాటు చేసిన 1.33 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాన్ని, ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రూ.5, 300 కోట్ల అంచనా వ్యయంతో కేజీ బేసిన్‌లో ఏర్పాటు చేసిన గ్యాస్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుని గుంటూరు సభ వేదిక నుంచే ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.అలాగే కృష్ణపట్నంలో 100 ఎకరాలలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న చమురు సమీకరణ, నిల్వ పంపిణీ టెర్మినల్‌కు ఇదే వేదిక వద్ద ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

ఈ పర్యటన సంగతి ఇలా ఉంచితే….గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.మరో వైపు విభజన చట్టం ప్రకారం చాలా వరకు ఇచ్చిన హామీలను అమలు చేశామని బీజేపీ వాదనకు దిగుతోంది.

అంతే కాదు… మోదీ ఏపీకి కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికే కాదు … పనిలో పనిగా… చంద్రబాబు మీద గత కొంతకాలంగా… చేస్తున్న విమర్శలకు….తగిన ఆధారాలు కూడా ఏపీ ప్రజలకు సాక్షధారలతో సహా వివరించేందుకు చూస్తున్నాడని తెలుస్తోంది.

అందుకే మోదీ పర్యటన గురించి బాబు అంత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube