కరోనా ను దాచేస్తున్నారా ?  ప్రధాని ఆరా ?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నిత్యం నాలుగు లక్షలకు దగ్గరగా వస్తున్నాయి.మరణాలు వేలల్లో సంభవిస్తున్నాయి అనే లెక్కలూ బయటకి వస్తున్నాయి.

 Modi Suspects That States Are Showing Less Of The Corona Cases, Bjp, Corona Viru-TeluguStop.com

కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్న, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగా నమోదవుతున్నాయి.అయితే అన్ని రాష్ట్రాలు వాస్తవ లెక్కలే చెబుతున్నాయా ? లేక కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నాయా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.ఎందుకంటే, ఆసుపత్రులలో కరోనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారి లెక్కలు, కరోనాతో మరణించిన వారి లెక్కలు, వాస్తవాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాచిపెట్టి, కేవలం తక్కువ సంఖ్యలో కేసులను చూపిస్తున్నారు అనే అనుమానం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కి వచ్చింది.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో పాటు, మరణాలు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల కంటే మరి కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి అనే అనుమానం అందరితోపాటు ప్రధానికి ఉంది.

ఎక్కడికక్కడ ఈ కేసులతో జనాలు సతమతం అవుతున్నారు.స్మశానం దగ్గర గంటలకొద్దీ క్యూ కనిపిస్తోంది.కరోనా కేసులు, మరణాలపై వాస్తవ లెక్కలు చెబితే ప్రభుత్వాల అసమర్థత గా తేలిపోతుంది అనే ఉద్దేశంతో , తప్పుడు లెక్కలు చెబుతున్నారనే విషయంపై ప్రధాని ఇప్పుడు ఆరాతీస్తున్నారు.వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది తేలితే దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందనే ఈ లెక్కలు బయటకి రావడం వల్ల నష్టమే జరుగుతుందని, కేంద్రం ఇప్పుడు చెబుతోంది.

అయితే కేంద్రం అన్ని రాష్ట్రాల్లో వాస్తవ లెక్కలు ఏంటి అనేది తెలుసుకునే అవకాశం లేకపోవడంతో, ఆయా రాష్ట్రాలు ఇచ్చే రిపోర్టుల పైనే ఆధారపడుతోంది.

Telugu Actual Corona, Carona, Central, Corona, Corona Wave, Covid, India Corona,

ఈ కరోనా విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటేనే ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఈ విధంగా కరోనా లెక్కలు దాచి పెట్టడం వల్ల ఈ వైరస్ ముప్పును మరింతగా పెంచినట్లు అవుతుంది.అందుకే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది చెప్పాలి అంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల కారణంగా భారత్ పై  ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదే సమయంలో రోజుకి నాలుగు లక్షల కేసులకంటే రెట్టింపు కేసులు నమోదవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube