న్యూయార్క్ పర్యటనకు సిద్దమైన మోడీ,పాక్ కీలక నిర్ణయం  

Modi Plane Not Allowed In Pakistan Airspace-modi Meet In Trump

ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్దిని చూపించింది.గతంలో ఆయన ఒక సదస్సు కు వెళ్లాల్సిన సమయంలో పాక్ గగనతలం పై వెళ్ళకూడదు అంటూ ఆంక్షలు విధించిన పాక్ ఇప్పుడు న్యూయార్క్ పర్యటనకు కూడా అలానే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

Modi Plane Not Allowed In Pakistan Airspace-Modi Meet Trump

న్యూయార్క్ లో ఒక కార్యక్రమానికి హాజరు అవ్వడానికి ప్రధాని మోడీ వెళుతున్నారు.క్రమంలోనే పాక్ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత అధికారులు పాక్ ని కోరారు.

అయితే పాక్ మాత్రం అక్కసు తో తన బుద్దిని మరోసారి చూపించింది.తమ గగనతలంలో మోడీ ప్రయాణించే విమానాన్ని అనుమతించబోము అంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు.

Modi Plane Not Allowed In Pakistan Airspace-Modi Meet Trump

ఈ విషయాన్నీ భారత అధికారులకు కూడా తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

మోడీ న్యూయార్క్ లో హాజరు అయ్యే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ క్రమంలోనే మోడీ,ట్రంప్ కలవనున్నారు అన్న అక్కసుతోనే పాక్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు