మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ దిశగా మోడీ ఆలోచన

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.కేవలం పది రోజుల వ్యవధిలోనే లక్ష కేసులు నమోదు కావడం ఒకింత కలవరపాటుకి కారణం అవుతుంది.

 Modi Plan To Lock Down Once Again, Corona Effect, Covid-19, Corona Virus, Indian-TeluguStop.com

లాక్ డౌన్ సడలింపుల కారణంగా వ్యాపార సంస్థలు అన్ని తెరుచుకున్నాయి.ఇక ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు.

దీంతో కరోనా వ్యాప్తి చాలా సులభంగా జరిగిపోయింది.కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కూడా లాక్ డౌన్ సడలింపులు కారణంగా విపరీతంగా బాధితుల సంఖ్య పెరిగిపోయింది.

దీంతో పాటు ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన వారి కారణంగా ఇతర రాష్ట్రాలలో కూడా కేసులు విస్తరిస్తున్నాయి.ఏకంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ నిబంధనలు వృధా అయిపోయాయి.

కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో పాటు హాస్పిటల్ బెడ్లు నిండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.ఈ నేపధ్యంలో అందరూ ఎవరి ఊళ్ళకి వారు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మరొక్కసారి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తే ఫలితం ఉంటుందని మోడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం మీద ప్రధాని నరేంద్ర మోదీ, తన మంత్రివర్గ సహచరులతో నిన్న అత్యవసర సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు హాజరయ్యారు.

కరోనా వ్యాప్తి, వైరస్ నివారణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు.దేశంలో మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చినట్టు పీఎంఓ వర్గాల సమాచారం.

కేసులు అత్యధికంగా ఐదు రాష్ట్రాల నుంచే వస్తున్నందున, ఆ రాష్ట్రాల్లో మాత్రం కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, మిగతా రాష్ట్రాలను మినహాయించాలన్న చర్చ కూడా వీరి మధ్య వచ్చిందని తెలుస్తోంది.మరోసారి లాక్ డౌన్ విధించే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ నెల 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube