అనంత విశ్వంలోకి మోదీ ఫోటో..!

ఈ సంవత్సరం అంతరిక్ష తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.వ‌చ్చే నెల చివ‌ర్లో ఓ ప్రైవేట్ శాటిలైట్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫొటో తోపాటు ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీని, 25 వేల మంది పేర్ల‌ను అంత‌రిక్షంలోకి మోసుకుపోనుంది.

 Sd Satellite To Take Modi Photo And Bhagavad Geeta Copy Into Space, Narendra Mod-TeluguStop.com

ఈ శాటిలైట్‌కు స‌తీష్ ధావ‌న్ లేదా ఎస్‌డీ శాట్ అనే పేరు పెట్టారు.పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా ఈ శాటిలైట్‌ను పంపించ‌నున్నారు.

ఈ సందర్భంగా స్పేస్ ‌కిడ్జ్ ఇండియా సీఈవో డాక్ట‌ర్ కేశ‌న్ మాట్లాడుతూ.త‌మ శాటిలైట్ నింగిలోకి దూసుకు వెళ్లే క్షణాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామన్నారు.స్పేస్ ‌లోకి వెళ్తున్న తమ తొలి శాటిలైట్ ఇదేనని, ఈ మిష‌న్‌  ను అభివృద్ధి చేస్తున్నప్పుడు పేర్లు పంపించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరామని, దీంతో వారంలోనే 25 వేల మంది పేర్లు వ‌చ్చాయన్నారు.ఈ పేర్ల‌తో పాటు ప్ర‌ధాని మోదీ ఫొటోను, ఒక భ‌గ‌వ‌ద్గీత కాపీని కూడా పంపుతామని తెలిపారు.

ఈ శాటిలైట్‌ లో పంపే పేర్ల‌లో ఇస్రో చైర్‌ ప‌ర్స‌న్ కే.శివ‌న్‌, సైంటిఫిక్ సెక్ర‌ట‌రీ ఉమా మ‌హేశ్వ‌ర‌మ్ పేర్లు కూడా ఉన్నాయని కేశన్ తెలిపారు.

Telugu Bhagavad Geeta, Keshan, Narendra Modi, Pslv, Sathishdhawan, Space, Univer

ఇక స్పేస్‌ సైన్స్‌, మా ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని అడిగాం.ఇందుకోసం వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి.వీటిలో 1000 పేర్లు విదేశీయులవి కాగా.చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపింది.ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను పంపనున్నాం.ఇక విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్ ‌ను అంతరిక్షం లోకి పంపాయి.

అందుకే, మేం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పంపించాలనుకుంటున్నాం’’ అని వెల్లడించారు.శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌక ను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube