వైరల్ గా మారిన మోడీ పాత ఫోటో విషయమేంటి!  

Modi Old Pic Goes On Viral-

జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం పై ఇప్పుడు సర్వత్రా చర్చకొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ ఆర్టికల్ రద్దుపై ప్రతి పక్ష పార్టీలు ఒక్కొక్కటి ఒక్కోలా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

Modi Old Pic Goes On Viral--Modi Old Pic Goes On Viral-

కొన్ని పార్టీలు ఇది చాలా ప్రశంసనీయం అని అంటుంటే,మరికొన్ని పార్టీ లు మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి.గతంలో ఎప్పుడూ లేని రీతిలో వేలాది మంది సైన్యాన్ని ఇటీవల కాశ్మీర్ కు తరలించడం,భద్రతాదళాల్ని కూడా పెద్ద ఎత్తున మొహరించటం లాంటి సంకేతాలతో అక్కడ చాలా సంచల నాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అనుమానాలకు తగ్గట్టుగానే కేంద్రం రాజ్యసభ లో ఈ ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన తీసుకురావడం అది క్షణాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అంగీకరిస్తూ గెజిట్ తీసుకురావడం తో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి.కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం తో ప్రతిపక్షాలు కొన్ని వ్యతిరేకిస్తూ దేశం తలనరికి వేశారు అంటూ ఆరోపిస్తుండగా, కొన్ని పార్టీలు మాత్రం ఈ ఆర్టికల్ రద్దుపై సంబరాలు కూడా చేసుకుంటున్నాయి.ఐతే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక ఫోటో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే మోడీకి చెందినదిగా చెబుతున్న పాత ఫోటో అది.

ఈ ఫోటోకు ఉన్న ప్రాధాన్యత ఏమిటన్నది చూస్తే.ఇప్పుడు ప్రధాని హోదాలో ఆర్టికల్ 370ను రద్దు చేసిన మోడీ.కొన్నేళ్ల క్రితం ఆర్టికల్ 370ను రద్దు చేయటం ద్వారా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ నిరసనను నిర్వహించారు.దానికి సంబందించిన ఫోటో అది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అయితే ఆ ఫోటో చూసిన వారు ఒకప్పుడు ఏ విషయం మీద అయితే మోడీ నిరసన వ్యక్తం చేశారో ఇప్పుడదే నిర్ణయాన్ని ప్రధాని హోదాలో నిర్వర్తించిన వైనంపై పలువురు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఈ రోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం తో ఆ ఫోటో ను చూసిన పలువురు మోడీ దశాబ్దాల కల నెరవేరింది అంటూ తెగ ప్రశంసిస్తున్నారు.

అయితే ఈ ఫోటో ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియలేదు.ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా లో ఈ ఫోటో తెగ వైరల్ అయిపొయింది.