మోదీ కొత్త చట్టం.. మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.. !

రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కోసారి తెచ్చే చట్టాల వల్ల ప్రజలకు మేలు ఎంత ఉందో అంతే నష్టం కూడా జరుగుతుంది.ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో సందర్భాల్లో బాధలు అనుభవించవలసి వస్తుంది.

 Modi New Law You Definitely Need To Know ,pm Modi, New Law, Old Vehicles, Scrap-TeluguStop.com

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కూడా ఇదే పరిస్దితి తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారట ప్రజలు.ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఏంటంటే ఎవరైనా పాత స్కూటర్, లేదా పాత బైక్, పాత కారు కలిగి ఉంటే అవి 15 సంవత్సరాల పీరియడ్ దాటితే వాటిని స్క్రాప్‌కు అమ్ముకోవలసి వస్తుందట.

ఎందుకంటే అవి ఉపయోగిస్తే చర్యలు తీసుకునే చట్టాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

కాగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించామని, మోదీ సర్కార్ కూడా ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం తెలపొచ్చని పేర్కొన్నారు.

కొత్త వెహికల్స్‌ డిమాండ్ పెంచడానికి, కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube