రూ.75 నాణాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ !  

pm modi , modi, india, Food and Agriculture Organization, 75 rupees coin - Telugu 75 Rupees Coin, Food And Agriculture Organization, India, Modi, Pm Modi

ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 నాణేన్ని విడుదల చేశారు.ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేశారు.దేశంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు.కాగా ఈ సందర్భంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

TeluguStop.com - Modi Issues Rs 75 Coin

ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలో ఉన్న పాత రికార్డులన్నీ చెరిగిపోయాయని రైతులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని తెలిపారు.అలాగే , దేశ ఆహార భద్రతకు రైతులను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.

సరైన వసతులు లేకపోవడంతో ఆహారాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందన్నారు.అయితే ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

TeluguStop.com - రూ.75 నాణాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వలన రైతులకు మరింత లబ్ది చేకూరుతుందని ప్రధాని మోదీ అన్నారు.అలాగే,ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని కూడా ప్రధాని మోదీ ఆహ్వానించారు.

భారత్ కూడా ఇందులో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు.ఇక,మరోవైపు పెళ్లి వయస్సు ఎంత ఉండాలన్న దానిపై తనకు లేఖలు వస్తున్నాయని , దానిపై చర్చలు నడుస్తున్నాయని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నూతన చట్టం రూపొందిస్తామని చెప్పారు.

.

#PM Modi #75 Rupees Coin #India #Modi #FoodAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Modi Issues Rs 75 Coin Related Telugu News,Photos/Pics,Images..