దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న విషయం తెల్సిందే.ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నా కూడా కరోనా వ్యాప్తి జరుగకుండా ఇండియా తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రపంచ దేశాలు అభినందనలు తెలియజేస్తున్నారు.

 Indian Prime Minister Narendra Modi Give The Message To Indian Peoples, Modi, In-TeluguStop.com

లాక్‌డౌన్‌పై ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.ఆ వీడియో సందేశంలో లాక్‌డౌన్‌ 9 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ ఆదివారం ప్రజలంతా ఒక పని చేయాలని విజ్ఞప్తి చేశాడు.

దేశంలో ప్రజలు అంతా ఏకతాటిపై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా కరోనాపై పోరాట సూచకంగా ఈనెల 5వ తారీకు ఆదివారం రాత్రి 9 గంట సమయంలో ఇంట్లోని లైట్లను అన్నింటిని కూడా ఆర్పేసి 9 నిమిషాల పాటు మైబైల్‌ లైట్లు, దీపాలు లేదా టార్చ్‌లు వేసి పట్టుకుని ఇంటి దర్వాజ వద్ద నిల్చోవాలని విజ్ఞప్తి చేశారు.ఇలా చేయడం వల్ల మనం అంతా ఒక్కటే అనే సందేశం కలుగుతుంది.

ఇందుకోసం రోడ్ల మీదకు రాకుండా ఎక్కడి వారు అక్కడే తమ మనో ధైర్యంను చూపించాలంటూ విజ్ఞప్తి చేశారు.ఇక కరోనా నియంత్రణకు ఇండియా తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు పరిశీలించడంతో పాటు మనను ఫాలో అవుతున్నాయి.130 కోట్ల మంది భారతీయులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి లాక్‌డౌన్‌ను మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తితో పాటించాలని విజ్ఞప్తి చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube