బాబు వాల్యూ పెంచిన మోదీ ! ఇది దేనికి సంకేతం ?

ప్రతిపక్షంలో ఉన్నా, తాము అధికారంలోనే ఉన్నామని, ఏపీ ముఖ్యమంత్రి తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడా ఏ రకమైన ఎత్తుగడ వేస్తే వర్కవుట్ అవుతుందో బాగా తెలిసిన వ్యక్తి.

 Modi Has Given A Seat In The National Committee To Increase The Priority Of Babu-TeluguStop.com

అందుకే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా టిడిపి పని అయిపోయింది అని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేసిన సమయంలో మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బాబు సక్సెస్ అయ్యారు.పార్టీ అధికారం లేకపోయినా, నిరంతరం ప్రజలలో తిరుగుతూ, ఏదో ఒక సమస్యపై పోరాడుతూ, అధికార పార్టీ తీరుని ఎండగడుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ప్రాధాన్యం అందరికీ తెలిసేలా చేశారు.గతంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, బిజెపి, టిడిపి మధ్య తీవ్ర స్థాయిలో వైరం ఉన్నా, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు కు కీలకమైన కమిటీలో స్థానం కల్పించారు.

 Modi Has Given A Seat In The National Committee To Increase The Priority Of Babu-బాబు వాల్యూ పెంచిన మోదీ ఇది దేనికి సంకేతం -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే ఏడాది భారత్ 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోనుంది.ఈ కార్యక్రమాల నిర్వహణ ను చాలా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు.

దీని కోసం దేశవ్యాప్తంగా ఒక కమిటీని నియమించారు.

ఈ కమిటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్థానం లభించింది.

వీరితో పాటు త్రివిధ దళాధిపతులు, లోక్ సభ, రాజ్యసభలో వివిధ పక్షాల నాయకులకు ప్రాధాన్యం ప్రకారం అవకాశం కల్పించారు.వారితో పాటు మరికొంత మంది ప్రముఖులకు స్థానం కల్పించారు.

ఈ కమిటీల్లో చంద్రబాబు, రామోజీ రావు, భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా కూడా ఉన్నారు.అలాగే క్రీడా రంగం నుంచి పీవీ సింధు, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ వంటి వారికి అవకాశం కల్పించారు.

ఈ కమిటీ తక్షణమే అమలులోకి వచ్చింది.ఇదిలా ఉంటే పూర్తిగా చంద్రబాబు ను పక్కన పెట్టేశారు అనుకుంటున్న మోదీ ఒక్కసారిగా ఈ జాతీయ కమిటీ లోకి చంద్రబాబును తీసుకుని ఆయన ప్రాధాన్యం పెంచడం ఆసక్తికరంగా మారింది.

Telugu 75th Independent Day Celebrations Committee, Ap, Bjp, Chandrababu Naidu, Indipendenceday, Jagan, Krushna Yella, Narendra Modhi, Ramijirao, Ramojirao, Seat To Chandrababu, Tdp, Tdp Bjp-Political

ఇప్పటికే బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.కానీ బాబు ఆశ తీర లేదు.బిజెపి ఎట్టిపరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడడం లేదు.సరిగ్గా ఇదే సమయంలో మోదీ బాబు ప్రాధాన్యం పెంచారు.ప్రధాని నరేంద్ర మోదీ నియమించిన ఈ కమిటీలో జగన్, బాబు ఇద్దరూ ఉండడం, బాబు పద్నాలుగేళ్ల సీఎం అనుభవం తప్పకుండా పనికొస్తుందనే ఉద్దేశంతో మోదీ ఈ విధంగా కమిటీలో అవకాశం కల్పించి, రాజకీయంగా టీడీపీకి ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Jagan #75thIndependent #SeatTo #Narendra Modhi #Ramijirao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు