మోదీ సర్కార్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

5 నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతుంది.ఆ పాపకు ముంబై లో చికిత్స జరుగుతుంది.

 Modi Govt Helps To Five Months Old Baby Treatment, Modi Govt,five Months Old Bab-TeluguStop.com

వ్యాధిని నయం చేసే మెడిసిన్స్ మన దేశంలో లభ్యం కావు.వాటిని అమెరికా నుండి దిగుమతి చేసుకోవాలి.

అయితే ఆ మందులకు 16 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.అంత డబ్బు ఆ పాప తల్లిదండ్రుల దగ్గర లేవు.

దీంతో ఆ పాప తల్లి సోషల్ మీడియాలో మోదీకి ఒక లేఖ రాసింది.దీంతో మోదీ సర్కార్ స్పందించి 5 నెలల చిన్నారి కోసం రూల్స్ ను పక్కన పెట్టి ఆ పాప ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.

తీరా కామత్ అనే చిన్నారి వెన్నెముక కండరాల బలహీనతతో బాధపడుతూ ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

అయితే ఆ చిన్నారికి వచ్చిన వ్యాధిని నయం చేసే మెడిసిన్స్ మన దేశంలో లభించవు.వాటిని అమెరికా నుండి దిగుమతి చేసుకోవాలి.వాటికి 16 కోట్ల రూపాయలు అవసరం.అయితే అంత డబ్బు ఆ పాప తల్లిదండ్రుల దగ్గర లేవు.

దీంతో వారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరించడం మొదలు పెట్టారు.ఆ పాప పరిస్థితి చూసి దాతలు భారీగా విరాళాలు అందచేశారు.మొత్తం 12 కోట్ల రూపాయలు సమకూరాయి.కానీ ఇంకా మెడిసిన్స్ కోసం డబులు సరిపోవు.

దీంతో ఆ చిన్నారి తల్లి మోదీకి సోషల్ మీడియాలో ఒక లేఖ రాసింది.

5 నెలల న కూతురు ప్రాణాలతో పోరాడుతుంది.తనను బ్రతికించుకోవడానికి కావలసినంత డబ్బు మా దగ్గర లేదు.దాతలు స్పందించి 12 కోట్ల రూపాయలను అందించారు.

వారందరికి కృతజ్ఞతలు.అమెరికా నుండి మెడిసిన్స్ దిగుమతి చేసుకోవాలంటే 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.16 కోట్లలో 23 శాతం దిగుమతి సుంకం, 12 శాతం జీఎస్టీ కూడా ఉంది.మొత్తం వీరికి 6 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

కాబట్టి ప్రభుత్వం మానవతాదృష్టితో సుంకాన్ని రద్దు చేస్తే 10 కోట్లకు మెడిసిన్స్ వస్తాయి.మా పాపకు చికిత్స అందుతుంది.

దయచేసి న కూతురుని బతికించండి.అంటూ ఆమె ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసింది.

ఈ లేఖకు ప్రభుత్వం వెంటనే స్పందించి.దానికి సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభించింది. దేవేంద్ర ఫడ్నవీస్ ఆ పాప మెడిసిన్స్ విషయంలో దిగుమతి సుంకాన్ని, జిఎస్టీని రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి ఫిబ్రవరి 1 న లేఖ రాసారు.మోదీ వెంటనే స్పందించి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించిన లేఖను దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్ లో ఫిబ్రవరి 9 న పోస్ట్ చేసారు.

5 నెలల పాప చికిత్స కోసం కీలక నిర్ణయం తీసుకున్న మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.పాపను అవసరమయ్యే మెడిసిన్స్ కోసం అయ్యే దిగుమతి పన్ను, జిఎస్టీని మినహించడమైనది.అని అయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసారు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా మోదీను ప్రశంసలతో ముంచుతున్నారు.

https://twitter.com/Dev_Fadnavis/status/1359166897971990535/photo/1

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube