మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ ఇచ్చిన బహుమతి ఏంటంటే....  

Modi Gifts To Maldivie\'s President-

భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.కేరళ లోని గురువయూర్ ని దర్శించుకొని తులాభారం ఇచ్చిన మోడీ అనంతరం అక్కడి బీజేపీ పార్టీ నేతలు పెట్టిన అభినందన సభలో పాల్గొన్న మోడీ అనంతరం మాల్దీవులకు వెళ్లారు.ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌కు క్రికెట్ బ్యాట్‌ను మోడీ బహుమతిగా ఇచ్చారు..

Modi Gifts To Maldivie\'s President--Modi Gifts To Maldivie's President-

ప్రధాని మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా ఒక ప్రత్యేక బహుమతులను అందిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షులు సోలీహ్ కు క్రికెట్ బ్యాట్ ని బహుమతిగా ఇచ్చారు.ఆ బ్యాట్ మీద టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఆయన జట్టు సంతకాలున్నాయి.

ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ లో

‘క్రికెట్‌తో ముడిపడిన బంధం.నా స్నేహితుడు, అధ్యక్షుడు సోహిల్‌కు క్రికెట్ అంటే అమితాసక్తి.అందుకే ఆయనకు ప్రపంచ కప్‌ ఆడుతున్న భారత జట్టు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహుకరించాను’ అని ట్వీట్ చేసారు.

మాల్దీవుల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ సహకరిస్తుందని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.మరోపక్క ఆ దేశ అత్యున్నత పురస్కారం, ప్రఖ్యాత ‘రూల్ ఆఫ్ నిషాన్ ఇజుదీన్‌’ అవార్డుతో మాల్దీవుల అధ్యక్షుడు ప్రధాని మోడీని సత్కరించినట్లు సమాచారం.మాల్దీవుల పర్యటన ముగిసిన తరువాత మోడీ శ్రీలంక లో పర్యటించనున్నారు..