మోడీ దారుణమైన కుట్రని బయటపెట్టిన “చంద్రబాబు”       2018-05-09   03:38:09  IST  Bhanu C

దక్షినాది పై మోడీ చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు..వచ్చే ఎన్నికల్లో దక్షినాది రాష్ట్రాల చేతిలో మోడీ కి చావు దెబ్బ తగలడం ఖాయమని ఊచించిన మోడీ తన వ్యుహాలకి పదును పెడుతున్నాడు…అదేంటంటే..దక్షిణాదిలో పార్లమెంట్ సీట్లను తగ్గించే కుట్రకి వ్యూహాలు రచిస్తున్నాడు ఇప్పటివరకూ కూడా ఈ పరిణామాలని ఎవరూ ఆలోచించలేదు. ఒకప్పుడు దేశంలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ అయ్యి చూపించాయి…ఎంతో పక్కా ప్రణాళిక చర్యలతో జనాభాను నియంత్రించాయి..అయితే

ఈ కుటుంభ నియంత్రణ విషయంలో మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభాను పెంచుకుంటూనే పోయాయి…అయితే జనాభా నియంత్రణ ఫలితాలు సాధించిన దక్షిణాది నష్టపోకుండ ఉండేందుకు ఇప్పటివరకూ కూడా 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ వస్తున్నారు.ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఇప్పుడు దక్షినాది కంటే కూడా ఉత్తరాది ని పెంచాలని భావిస్తున్నారు..ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశక్తి లేదని కూడా చెప్తున్నారు.

అయితే ఈ లెక్కల ప్రకారం చూస్తే దక్షిణాది లో సీట్లు తగ్గిపోతాయని… ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ ఈ క్రమంలో మోడీ చేస్తున్న కుట్రకోణాన్ని బయటపెట్టారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటంటే…దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్‌సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడటమే..అయితే కుటుంభ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు…అయితే దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం 2026 వరకు మారదు.

కానీ కేంద్రం గనుకా తాజా జనగణనను పరిగణలోకి తసుకుంటే మాత్రం… దక్షిణాది లోక్ సభ సీట్లు తగ్గపోతాయి. ఉత్తరాదికి పెరుగుతాయి..దాంతో పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల పట్టు తగ్గిపోతుంది ఇప్పటివరకూ దక్షినాది రాష్ట్రాలు అంటే భయపడే కేంద్రం ఇప్పుడు తాజా కుట్రని అమలు చేయడానికి సర్వం సిద్దం చేస్తోంది అంటున్నారు చంద్రబాబు.