చంద్రబాబు “దీక్ష” మోడీకి “అగ్ని పరీక్ష”       2018-04-20   03:48:17  IST  Bhanu C

ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ,విభజన హామీ హక్కుల కోసం, పేద ప్రజల ముఖాలలో చిరునవ్వుకోసం మోడీ దీక్ష పూనారు..68 ఏళ్ల వయస్సు లో యువకుడినా మండుటెండలు బగ్గు మంటున్న తరుణంలో ఎంతో సాహసంగా చంద్రబాబు మొదలు పెట్టిన ఈ ధర్మ పోరాట దీక్షకి అశేష ప్రజానికం చంద్రబాబు కి మద్దతుగా నిలుస్తోంది..తన పుట్టినరోజునాడు కుటుంభంతో సరదాగా గడపకుండా రాష్ట్రం కోసం దీక్షని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు..అయితే

-

ఈ దీక్ష పై కేంద్రప్రభుత్వం డేగ కళ్ళతో నిఘా ఉంచింది. చోట మోట నాయకుడి దీక్ష అయితే పెద్దగా పట్టించుకోకపోదురేమో కానీ జాతీయ స్థాయి నేత కావడం తో ఈ దీక్ష చేపడుతున్నందుకు కేంద్ర పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష 12 గంటల పాటు అంటే రాత్రి 7 వరకు కొనసాగనుంది..సర్వమత ప్రార్థనల అనంతరం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు.

అయితే చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు అనుకున్న ఆనికంటే కూడా ఊహించని మద్దతు అన్ని వర్గాల నుంచీ మద్దతు బాగా లభిస్తోంది. మాజీ సైనికులు, స్వతంత్ర సమరయోధులు, కూడా బాబు దీక్షకు మద్దతు తెలియజేసారు. దీక్ష ముగిసిన అనంతరం ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా దీక్ష ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు తెలియజేస్తున్నారు. ఆయనతోపాటు ఈ దీక్షకు సంఘీభావంగా హాజరైన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కూడా మాట్లాడటం జరుగుతుంది..

అయితే అన్ని జిల్లాల నేతలు చంద్రబాబు దీక్షకు మద్దతుగా దీక్షలు చేస్తున్నారు..దీంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు దీక్షపై ఆసక్తి కలుగుతోంది…మరో పక్క మోడీ తన ఇంటిలిజెన్స్ తో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది.. అంతేకాదు చంద్రబాబు ఈ దీక్ష తరువాత ఓ కీలక ప్రకటన కూడ చేసే అవకాశం ఉంది అంటున్నారు టిడిపి వర్గం నేతలు చంద్రబాబు ఈ ఒక్క దీక్షతో ఇక ఏపీలో బీజేపి పెట్టేబేడా సర్దేసుకోవటమే అంటున్నారు విశ్లేషకులు

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.