వెస్ట్రన్ దేశాల మీడియాలో మోదీపై విమర్శలు.. ఎందుకంటే.. ?

దేశానికి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎందరో ఈ ప్రధాని దేశానికి ఏం చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారు.కాని అనతి కాలంలోనే మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 Western Media Fires On Pm Modi, Modi Govt, Corona Second Wave, Covid Cases,westr-TeluguStop.com

దీంతో ఒక్క సారిగా మోదీ గ్రాఫ్ పెరిగిపోయింది.ఈయన విదేశాలను విపరీతంగా సందర్శిస్తున్నా దేశం కోసమే అని సర్ధుకున్నారు.

నోట్ల రద్దు చేసి సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేసినా పోనీలే అని ఊరుకున్నారు.

ఇలా వైపల్యాలు ఎన్ని కనిపించినా దేశప్రజలు సర్ధుకుపోయారు.

ఇదే సమయంలో ప్రధాని పై ఉన్న అభిమానం క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇదే సమయంలో కరోనా దేశంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో ఎలాగోలా దీని బారి నుండి దేశాన్ని రక్షించారని పొగిడారు.

కానీ కరోనా భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్ని హెచ్చరించడానికి వచ్చిందని గుర్తించ లేకపోయారు.

దీని కారణంగా ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమే కారణమని ప్రపంచ మీడియాలో విమర్శలతో కూడిన వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న కేంద్రం, జాగ్రత్తలను గాలికి వదిలేసిందని, రెండో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని తెలిసినా సన్నద్ధంగా లేదని పేర్కొన్నాయి.

అంతే కాకుండా సరిహద్దులు దాటి మిగతా ప్రపంచానికి కూడా ముప్పుగా మారుతున్న ఇండియాలో పుట్టిన కరోనా తీవ్రత తెలిసి కూడా, రెండో దశ వ్యాప్తికి ఏడాది సమయాన్ని ఉంచుకుని నరేంద్ర మోదీ తీవ్ర నిర్లక్ష్యం చేశారని, రెండో వేవ్ ను అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు చేపట్టలేదని ఈ సందర్భంగా ‘ఎకానమిస్ట్’ ప్రశ్నించింది.

మొత్తానికి ఇది పాలకుల వైఫల్యమే అని విదేశీ పత్రికలు వేలెత్తి చూపిస్తున్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube