జ‌గ‌న్‌ను అడ్డం పెట్టి.. మోడీ రాజ‌కీయం.. ఏం జ‌రుగుతోందంటే..!

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీ.ఆదిశ‌గా చేప‌డుతున్న చ‌ర్య‌ల మాటేమో.కానీ, త‌న హవాను పెంచుకునేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ మాత్రం చాలా వ్యూహాత్మ‌కంగా ద‌క్షిణాదిపై అడుగులు వేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.“నాతో మిత్రులుగా ఉంటే.మీకు ఎంత లాభ‌మో.తెలుసుకోండి“ అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఇటీవ‌ల వినిపిస్తోంది.ద‌క్షిణాది రాష్ట్రాల్లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి.కేంద్ర‌మే వీటిని ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.అయితే, ఈ విష‌యంలో మోడీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 Modi Doing Politics With Jagan, Jagan Mohan Reddy, Andhra Pradesh, Chief Ministe-TeluguStop.com

త‌మిళ‌నాడులో కావేరీ న‌ది జ‌లాల విష‌యంలో కేంద్రం ప‌రిష్కారం చూపించాలి.

తెలంగాణ‌లోనూ విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయాలి.ఇక‌, ఒడిసాలోనూ ఏపీ క‌డుతున్న‌ పోల‌వ‌రం‌ప్రాజెక్టు కార‌ణంగా ఉన్న ముంపు స‌మ‌స్య‌ను కేంద్ర‌మే ప‌రిష్క‌రించాలి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.అన్ని రాష్ట్రాల‌తో స‌మానంగా జీఎస్టీ ప‌రిహారం విష‌యంలోనూ కేంద్రం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు మేలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే, ఏ విష‌యంపైనా మోడీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.కానీ, అదేస‌మ‌యంలో కొన్ని సంకేతాలు ఇస్తున్నారు.

అదేంటంటే.ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుకు అనుకూలంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే.!

జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజ‌ధానుల విష‌యంలో త‌మ జోక్యం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేయ‌డ‌మే కాకుండా.ఒకే రాజ‌ధాని ఉండాల‌నే నియ‌మం ఎక్క‌డా రాజ్యాంగంలోనూ లేద‌ని చెప్ప‌డం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించ‌డమే.

ఇదే విష‌యాన్ని హైకోర్టుకు చెప్ప‌డం ద్వారా మోడీ.ప‌రోక్షంగా జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించారు.

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టుకు గ‌డిచిన మూడేళ్లుగా ద‌క్క‌ని పెండింగ్ నిధుల‌ను త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.అదేవిధంగా జిల్లాల విభ‌జ‌న‌కు కూడా స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ ప‌రిణామాల వెనుక‌.జ‌గ‌న్ వ్య‌హారాన్ని చూపిస్తూ.తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిసా, కేర‌ళ రాష్ట్రాల‌కు మోడీ వ్యూహాత్మక రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ను అమ‌లు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేంద్రానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కేంద్రం తీసుకుంటున్న‌నిర్ణ‌యాల‌ను ఆయ‌న స్వాగ‌తిస్తున్నారు.జీఎస్టీ ప‌రిహారం ఇవ్వ‌క‌పోయినా.

ఇచ్చిన‌ప్పుడే తీసుకుందామ‌ని అనుకుంటున్నారు.దీంతో మోడీ.

జ‌గ‌న్‌ను త‌న‌కు అనుకూలంగా చూపిస్తూ.ఇత‌ర రాష్ట్రాల‌ను త‌న లైన్లోకి తెచ్చుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube