ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన మోదీ.. అందుకేనా.. ?

జీవితం విలువ తెలిసిన వారికి మరణం విలువ తెలుస్తుంది.అసలు జీవితం అంటే గాలిలో దీపం వంటిది అని ఆలోచించే వారికి మరణం విలువ కూడా తెలియదు.

 Modi Discusses With Chief Ministers Of Three State Pm Modi, Phones 3 Chief Minis-TeluguStop.com

నిజానికి కరోనా ఇంతలా మృత్యు గంటలు మోగిస్తుంటే, ప్రతి వారు తనకు తానుగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ రోజు పరిస్దితులు ఇంతలా భయపెట్టేవి కాదు అన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతుందట.

ఇదిలా ఉండగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్ర కరోనాకు విలవిల్లాడుతోంది.

గత 24 గంటల్లో మహారాష్ట్రలో 54,022 పాజిటివ్ కేసులు నమోదవగా, 898 మంది మహమ్మారి కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారట.అదీగాక కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు వినియోగిస్తున్న కోవిన్ వెబ్ సైట్ లో పలు ఇబ్బందులు తలెత్తుతున్న క్రమంలో తమ రాష్ట్రం వరకు ప్రత్యేకమైన యాప్ ను తయారు చేసుకుంటామని కేంద్రానికి థాకరే నిన్న లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో నేడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులైన ఉద్ధవ్ థాకరే, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడటం గమనార్హం.ఇకపోతే ప్రధాని మోదీ గత మూడు రోజుల వ్యవధిలో 10 మంది సీఎంలు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్దితుల పై ఆరా తీసారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube