బీజేపీలో మోడీ శ‌కం... అయినా డేంజ‌రేనా..!

దేశ‌వ్యాప్తంగా తాజాగా వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ దూకుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

 Modi Decade In Bjp.. Then Also Danger,bjp,narendra Modi,bihar,clean Sweep,tejasw-TeluguStop.com

బిహార్ ఎన్నిక‌ల్లో.మ‌ధ్య ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో.

ఇక‌, తెలంగాణ దుబ్బాక ఉప‌పోరులోను బీజేపీ దూకుడు మామూలుగా లేద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.ఇక‌, బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూల కూట‌మి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చేసింది.

పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్కించుకున్న కూట‌మిగా నిలిచింది.అయితే, దీని వెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి బిహార్‌లో 12 స‌భ‌ల‌కు మోడీ హాజ‌ర‌య్యారు.ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప‌థ‌కాల‌కు ఎన్నిక‌ల కోడ్ వ‌ర‌కు చేప‌ట్టారు.ఇంటింటికీ గ్యాస్‌, తాగు నీరు, పైపులైన్ల ఏర్పాటు, గ్రామీణ స‌డ‌క్ యోజ‌న వంటివి అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు నుంచి ప‌రుగులు పెట్టించారు.క‌రోనా నియంత్రణ  విష‌యంలోనూ మోడీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశాయి.

నితీష్ కుమార్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని.ఆయ‌నే త‌దుప‌రి సీఎం అభ్య‌ర్థిఅంటూ.

ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల ముందుగానే స్వ‌యంగా ప్ర‌క‌టించి.కూట‌మిలో సీఎం అభ్య‌ర్థి విష‌యంలో ఉన్న గంద‌ర‌గోళానికి తెర‌దించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ దూకుడు పెంచారు.ఇలా .మొత్తంగా మోడీ పైకి క‌నిపించ‌క‌పోయినా.తెర‌వెను బిహార్ ఎన్నిక‌ల‌కు బాగానే క‌ష్టించారు.

ఇక‌, దుబ్బాక పోరు విష‌యంలోనూ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.దీంతో మోడీ వ్యూహం ప్ర‌కార‌మే ఇక్క‌డ కూడా ప్రచార ప‌ర్వం ముందుకు సాగింది.

ఫ‌లితం ఎలా ఉన్నా.బీజేపీ మాత్రం ప‌రుగులు పెట్టింది.

అధికార టీఆర్ ఎస్‌కు చెమ‌ట‌లు ప‌ట్టించింద‌నే చెప్పాలి.అయితే, గెలుపు ఓట‌ముల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.

మోడీకి ఈ ప‌రిణామాలు సంతృప్తిక‌రంగానే ఉన్నాయా? అంటే.లేవ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

తానే స్వ‌యంగా రంగంలోకి దిగి.12 ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నా.బీజేపీ-జేడీయూ కూటమి క్లీన్ స్వీప్ చేయ‌లేదు.అంతేకాదు, యువ నాయ‌కుడు తేజ‌స్వి దూకుడుకు కూడా క‌ళ్లెం వేయ‌లేక పోయారు.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగానే కాదు.బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా కూడా తేజ‌స్వి నిల‌బ‌డ్డారు.

రేపు ఒక వేళ ఓ 20 మంది ఎమ్మెల్యేలు గోడ దూకి.తేజ‌స్వికి మ‌ద్ద‌తు ప‌లికితే.

నితీశ్ స‌ర్కారు కూలిపోయే ప్ర‌మాద‌మే ఉంది.ఇలా మొత్తంగా.

బిహార్ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కినా.దిన‌దిన గండంగానే స‌ర్కారు ముందుకు సాగే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube