ఇమ్రాన్ పంచ్ కి మోడీ లాస్ట్ మార్క్ పంచ్! ఇరకాటంలో కాంగ్రెస్!  

Modi Counter On Imran Khan Comments -

ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.బీజేపీ పార్టీకి, రాహుల్ గాంధీ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Modi Counter On Imran Khan Comments

ప్రధాని మోడీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, దేశంలో శాంతిభద్రతలు, అలాగే హిందువుల ముసుగులో జరిగిన దాడులని ఎక్కువగా హైలెట్ చేస్తూ బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే ఆర్మీ చేసిన పోరాటం కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటూ విమర్శలకి తెరతీసారు.

ఇదిలా ఉంటే మరో వైపు ఎన్నికల్లో భాజపా విజయం మీద ప్రభావం చూపేందుకే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.మోదీ అధికారంలోకి వస్తేనే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సాధ్యమవుతాయని కొద్ది రోజులు క్రితం ఇమ్రాన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పాక్‌ ఎన్నికల సమయంలో కూడా మోడీని లక్ష్యంగా చేసుకొని భారత్ తో పోరాటంలో ఇతర పార్టీలు విఫలం అయ్యాయని ప్రచారం చేసుకొని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు.

ఇక ఇమ్రాన్ ఖాన్ వాఖ్యలని మోడీ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు.తనని లక్ష్యంగా ఇమ్రాన్ వాఖ్యలు చేసి అక్కడ లాభపడ్డారని, అలాగే తాను ఉంటే వారి ఆటలు సాగవని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు.దేశ శాంతి భద్రతలు కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే ఇక ఇమ్రాన్ ఖాన్ తన పని సులువుగా చేసుకుంటాడని కూడా కొత్త రాగం ఓ విధంగా ప్రత్యర్ధి దేశం అధినేత తనపై చేసిన వాఖ్యలని ఖండించని కాంగ్రెస్ పార్టీని తన లాస్ట్ పంచ్ తో ఇరుకున పెట్టాడని స్పష్టం అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Modi Counter On Imran Khan Comments- Related....