కరోనా వ్యాక్సిన్ వస్తే ముందు ఎవరికి ఇచ్చేదో తేల్చి చెప్పిన మోడీ...!

రోజు రోజుకి భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత మరింతగా పెరుగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే మరో వైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ల తయారీ కూడా రోజురోజుకు మరింత వేగం పుంజుకుంటుంది.

 Modi Decides Who Will Be Given The Corona Vaccine Before It Arrives Coronavirus-TeluguStop.com

అయితే ప్రస్తుతానికి రష్యా దేశం లో వ్యాక్సిన్ మూడు దశలను దాటుకొని ప్రజలకు ఇచ్చే దిశగా అడుగులు వేసింది.అంతే కాదు మరో మూడు కంపెనీల నుండి కూడా వ్యాక్సిన్లు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.

ఈ విషయాన్ని ఇదివరకే నీతి అయోగ్ ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.అయితే ఇప్పుడు ఒకవేళ కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయితే ముందుగా ఎవరికి ఇస్తారన్నది అందరిలో కలిగే ఓ చిన్న ప్రశ్న.

అయితే ఇందుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక క్లారిటీ ఇచ్చారు.భారతదేశంలో మొదటగా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కరోనా వారియర్స్ కు ముందుగా వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు అనుమతిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి ఏ ఒక్క వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కరోనా తో ఇబ్బంది పడుతున్న యువతులకు ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చెప్పుకువచ్చాడు.

ప్రస్తుతం చివరి దశలో కొనసాగుతున్న వ్యాక్సిన్ లను అనుమతి ఇస్తే ప్రపంచవ్యాప్తంగా వాటిని రెడీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే ముందుగా కరోనా పేషెంట్లకు, ఆపై వారికి వైద్య సహాయం అందించే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా కరోనా వ్యాక్సిన్ ఇస్తారని అందరూ ఆలోచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube