రాజ‌కీయ ఉత్కంఠ‌లో మోడీ క‌న్‌ఫ్యూజ్ పాలిటిక్స్

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ్య‌వ‌హార శైలి అంచ‌నాల‌కు అంద‌దు.మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయంగా ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప‌రిస్థితుల్లో ప్ర‌త్య‌ర్థుల‌ప‌ట్ల‌ ఆయ‌న స్పంద‌న చాలా భిన్నంగా ఉంటుంది.

 Modi Confused Politics-TeluguStop.com

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌పై, హ‌క్కుల కోసం విప‌క్ష నేత‌లు ఉద్యమిస్తున్న వేళ‌లో ఆయ‌న రూటే స‌ప‌రేట్‌గా ఉంటుంది.నిజంగా ఆయ‌న ఏ ఉద్దేశంతో మాట్లాడుతారో.

ట్వీట్లు చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌తో తెలియ‌దుగానీ ఆ స‌మయంలో రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌నే టాక్ మాత్రం బ‌య‌ట‌కు వినిపిస్తోంది.

ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయంగా గంద‌ర‌గోళ ప‌ర్చ‌డ‌మే ధ్యేయంగా ఆయ‌న పావులు క‌దుపుతార‌నే వాద‌న కూడా ఉంది.

తాజాగా.జేడీఎస్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌కు కూడా ప్ర‌ధాని మోడీ శుక్ర‌వారం ఫోన్లో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్ప‌డం కూడా రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అంతేగాకుండా.ఈ విషయాన్ని ఆయ‌న‌ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

‘‘మన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ‌ గారితో మాట్లాడి జన్మదిన శుభాకాక్షలు చెప్పాను.ఆయన పూర్తి ఆరోగ్యంతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.

దేవెగౌడ.1996 జూన్‌ 1 నుంచి 1997 ఏప్రిల్‌ 21 వరకు ప్రధానిగా పనిచేశారు.అంతేగాకుండా దేవేగౌడ కుమారుడు, జేడీఎస్ నేత రేవ‌ణ్ణ‌తో కూడా మోడీ ఫోన్లో మాట్లాడిన‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నేప‌థ్యంలో మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మరింత ఉత్కంఠ రేపుతోంది.

అయితే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ఆయ‌న దేవెగౌడ‌తో మాట్లాడ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికారంలో బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి హోరాహోరీగా త‌ల‌ప‌డున్న త‌రుణంలో మోడీ వ్య‌వ‌హార శైలి రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రంలోని బీజేపీ న‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు ఏప్రిల్ 20న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ను చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంలో కూడా మోడీ చంద్ర‌బాబుకు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇలా రాజ‌కీయంగా తీవ్ర ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్న స‌య‌మంలో మోడీ మాట్లాడం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube