కాంగ్రెస్ గాలి తీసేసిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశ వ్యాప్తంగా జరుగుతున్నా సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశకి వచ్చేసాయి.ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి కాగా త్వరలో నాలుగో దశలో మరికొన్ని స్థానాలలో ఎలక్షన్స్ జరగనున్నాయి.

 Modi Comments On Congers Party Related To Surgical Strikes-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో రెండో సారి ప్రధాని పీఠం మీద కూర్చోవడానికి రెడీ అయిన నరేంద్ర మోడీ తనదైన శైలిలో మాటల దాడితో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.ఎన్నడూ దేశ రాజకీయాల్లో మొదటి ప్రధాని నెహ్రుని ఒక్క మాట కూడా విమర్శించిన దాఖలాలు లేవు.

అయితే మొదటి సారి మోడీ నెహ్రుని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు.ఇది బీజేపీకి సానుకూలమైన అంశమే అయిన మోడీకి రాజకీయంగా ఎంత వరకు కలిసి వస్తుంది అనేది సందేహమే.

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ హయాంలో కూడా సర్జిక స్త్రైక్స్ చేసామని వాటిని ఎప్పుడు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు అంటూ బీజేపీని, మోడీని విమర్శించారు.అయితే దానికి కౌంటర్ గా మోడీ తాజాగా ఓ ప్రసంగంలో మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ‘వీడియోగేమ్’ స్ట్రైక్స్ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ తమ ప్రభుత్వం లో ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని లెక్కలు చెబుతోంది.మూడు సర్జికల్స్ స్ట్రైక్స్ చేశామని ఆ పార్టీకి చెందిన నేత నాలుగు నెలల కిందటే చెప్పారు .ఇప్పుడది కాస్తా ఆరు అయ్యింది.ఎన్ని కలవగానే ఈ సంఖ్య 600 అవుతుంది అని కాంగ్రెస్ నేతలపై వంగ్య బాణాలు విసిరారు.

ఆ పార్టీ చెప్తున్నవన్నీ అబద్దాలే నని,యూపీఏ సర్జికల్ స్ట్రైక్స్ అన్నీ కాగితాల్లో మాత్రమేకనబడతాయని చెప్పారు మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube