మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశం..!!

Modi Chaired Emergency Meeting

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మరికొంత మంది సైనికులు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం తెలిసిందే.అయితే ఈ ఘటనకు సంబంధించి ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 Modi Chaired Emergency Meeting-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం అయింది.ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా హెలికాప్టర్ ప్రమాదంపై చర్చలు జరుపుతున్నారు.

ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు.

 Modi Chaired Emergency Meeting-మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా రక్షణశాఖ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి నివేదిక భద్రతా వ్యవహారాల కమిటీకి ఇవ్వడం జరిగింది.13 మంది మరణించిన ఈ దుర్ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.ఉగ్రవాద కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే హెలికాప్టర్ అంతకుముందు ప్రమాదానికి గురైనట్లు.కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సంఘటన జరిగిన తర్వాత బిపిన్ రావత్ ఇంటికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు ఆర్మీ ఉన్నత అధికారులు వెళ్లడం జరిగింది.

#PM Modi #Bipin Rawat #Rajnath #ModiChaired #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube