బ్లాక్ వైట్ చేసుకునే బంప‌ర్ ఆఫ‌ర్‌

న‌ల్ల‌ధ‌నంపై కొర‌డా ఝ‌ళిపించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.ఈ క్ర‌మంలో దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.

 Bumper Offer To Black Money Holders-TeluguStop.com

సంచ‌ల‌న నిర్ణ‌యం వెల్ల‌డించారు.అదేస‌మ‌యంలో న‌ల్ల కుబేరులు ప‌ట్టుబ‌డితే.200 శాతం జ‌రిమానా, ప‌దేళ్ల జైలు అంటూ ద‌డ పుట్టించారు.ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచ‌ల‌నం రేగింది.0.28%గా ఉన్న న‌ల్ల కుబేరుల కోసం 99.72% మందిని అష్ట‌క‌ష్టాల పాలు చేస్తారా ? అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.ఇక‌, ప్ర‌భుత్వానికి కూడా ఈ క్ర‌మంలో ఆశించిన విధంగా న‌ల్ల‌డ‌బ్బుపై ఉప్పంద‌లేదు.

న‌ల్ల‌కుబేరులు బ‌య‌ట‌ప‌డ‌లేదు.

దీంతో.

త‌మ ప్ర‌క‌ట‌నే కొంప ముంచింద‌ని, త‌మ ప్లాన్ ఆశించిన విధంగా స‌క్సెస్ కాక‌పోవ‌డానికి భారీ జ‌రిమానా.జైలే కార‌ణాల‌ని గుర్తించిన మోడీ స‌ర్కారు కొంత వెన‌క్కి త‌గ్గింది.

జ‌రిమానాను ఎత్తివేసింది.న‌ల్ల కుబేరుల‌కు భారీ ఎత్తున ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.రూ.2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి నిబంధ‌న‌లూ వ‌ర్తించ‌వ‌ని పేర్కొన్న అధికారులు.ఆ త‌ర్వాత మొత్తాల‌కు లెక్క‌లు చూపాల‌ని, లేనిప‌క్షంలో 50% ప‌న్ను క‌డితే స‌రిపోతుంద‌ని, ఎలాంటి జ‌రిమానాలూ, జైళ్లూ ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది.

దీనికి సంబంధించిన స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టేందుకు అన్నీ సిద్ధం చేసింది.

వాస్త‌వానికి.ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత దేశంలో న‌ల్ల కుబేరులు క‌లుగుల్లోంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని అంద‌రూ భావించారు.అయితే, అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి చందంగా.

ప్ర‌ధాని మోడీ అలా ఆలోచిస్తే.న‌ల్ల‌కుబేరులు మ‌రోలా ఆలోచించారు.

త‌మ డ‌బ్బును పేద‌ల ఖాతాలైన జ‌న్‌ధ‌న్ ల‌కు మళ్లించారు.మీకింత‌.

మాకు కొంత త‌ర‌హాలో వారి డ‌బ్బు.ఇప్పుడు పేద‌ల ఖాతాల్లో జ‌మ అయింది.

మొత్తం 21 వేల కోట్లు జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోకి చేరాయి.దీనిపై స‌మాచారం అందుకున్న మోడీ.

అలా చేయొద్ద‌ని పేద‌ల‌కు సూచించారు.అలాంటి ఖాతాల‌ను సీజ్ చేస్తామ‌ని, లెక్క‌లు చెప్ప‌క‌పోతే.

శిక్ష కూడా త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

అయితే, ఇది అంతిమంగా త‌మ మెడ‌కే చుట్టుకుంటుద‌న్న పెద్ద‌ల సూచ‌న‌ల‌తో ఆయ‌న ఒక అడుగు వెన‌క్కి వేసి.

తాజా ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.ఈ 50 రోజుల వ్యవధిలో డిపాజిట్ అయ్యే లెక్కల్లేని మొత్తంపై 50 శాతం పన్ను విధించేందుకు వీలుగా ఆదాయం పన్ను చట్టానికి సవరణ తెచ్చినట్టుగా తెలుస్తోంది.

పార్లమెంట్ ప్రస్తుత సమావేశ కాలంలోనే దీనికి ఆమోద ముద్ర వేయించుకోవాలనీ కేంద్రం పట్టుదలగా ఉంది.

నల్లధనం అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు సరైన చర్యే అయినప్పటికీ బినామీ లావాదేవీల ద్వారా సంపాదించిన సంపద మళ్లీ సమాజంలోకి వస్తే ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుందన్న ఉద్దేశంతో మోడీ ఈ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా.దీనిని న‌ల్ల కుబేరులు వినియోగించుకుంటారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube