మోడీ సర్కార్ నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.దీని ద్వారా ఈజీగా ఉపాధి పొందవచ్చు.
ఈ స్కీమ్ లో వారే ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిగపిస్తారు.పి ఎం కె వి వై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన భాగంగా మన నరేంద్ర మోడీ మూడవ విడత స్కీమ్ మొదలు పెట్టారు.
దీని వల్ల నిరుద్యోగులకు ప్రయోజనము కలుగుతుంది.ఉపాధి లభించనుంది.
నిరుద్యోగుల కోసం మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఇప్పటికే ఎన్నో స్కీములు తీసుకువచ్చారు.అందులో భాగంగా నిరుద్యోగులకు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్.హార్డ్‌వేర్.నెట్వర్కింగ్ క,స్టమర్ రిలేషన్ మేనేజర్ మెంట్,డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రంగాలలో ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
ఇక శిక్షణ పూర్తి అయిన తరువాత ఉద్యోగం సాధించే క్రమంలో ఇంటర్వ్యూలో ఎదుర్కొనే విధానాన్ని నేర్పిస్తారు. కౌశల్ కేంద్రాల్లో ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు నేషనల్ స్కిల్ కార్పొరేషన్ నుంచి సర్టిఫికెట్లు ఇస్తున్నారు.

ఇక 2017 డిసెంబర్ 11 నిజామాబాదులో కౌశల్ కేంద్రం ప్రారంభించడం జరిగింది.ఇప్పటికీ అనేక చోట్ల పి ఎన్ కె వై లాంటి ఇన్స్టిట్యూట్ లో పెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
ఇలా ఉండగా మోడీ ప్రభుత్వం సరికొత్తగా పి ఎం కె వి వై 3.0 స్కీమ్ కింద 948 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.దీనికోసం జిల్లాలో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు.దీని ద్వారా వోకేషనల్ ట్రైనింగ్ అందిస్తారు.దీనివల్ల యువతకు తమకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని వాటిలో శిక్షణ పొందవచ్చు.ఈ మూడవ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా 717 జిల్లాల్లో అమలు చేస్తామని మంత్రిత్వశాఖ తెలిపింది.ఇందుకు మీరు https://pmkvyoffical.org వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.అలాగే ట్రైనింగ్ తీసుకోవచ్చు.ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.