ఆరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోడీ

దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా అస్సోం, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి.

 Narendra Modi Talking About That Six States Cm's, Modi, Assma, Up, Kerala, Karna-TeluguStop.com

పలు చోట్ల ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ఆరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే అక్కడ జాతీయ విపత్తు బృందాలు సేవలు అందిస్తున్నాయి.ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కావాల్సిన సాయంను చేసేందుకు ముందుకు వస్తామని ప్రకటించారు.

నైరూతి రుతుపవనాలు మరియు అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న వర్షాలు ఆ ఆరు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి.

రైతుల నుండి సామాన్య వ్యాపారుల వరకు అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కరోనా విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాలకు విఘాతం కలుగుతోంది.వరదలను నిరోదించేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలంటూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సలహా ఇచ్చారు.అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంలకు మోడీ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube