అలా చేస్తున్నాడా ? జగన్ పాలన పై మోదీ గుర్రు ?

జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని అంత స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, కొంతమంది జగన్ పనితీరును మెచ్చుకుంటుంటే మరికొంతమంది ఇది మాత్రం ఈ తొమ్మిది నెలల కాలంలో జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కానీ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించడం లో కాని జగన్ అనుసరిస్తున్న వైఖరి సరికాదంటూ మరికొంతమంది జగన్ ను విమర్శిస్తున్నారు.

 Modi Angry On Jagan Mohan Reddy-TeluguStop.com

ఇక ఈ విషయంలో ఇప్పటివరకు పెద్దగా జోక్యం చేసుకొని కేంద్ర బిజెపి పెద్దలు ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ప్రధాన మంత్రి మోదీ జగన్ తీరును తప్పుపడుతున్న ప్రచారం జరుగుతోంది.

కొత్తగా అధికారంలోకి రావడం, అధికారం చేపట్టి కొంతకాలమే అవడంతో జగన్ ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదని, కానీ జగన్ దూకుడు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని, అడుగడుగున ఆయన అనుభవరాహిత్యం బాగా కనిపిస్తోందని ఇక పూర్తి స్థాయిలో జగన్ దూకుడు కళ్ళం వేయాల్సిన సమయం వచ్చేసినట్టు ప్రధాని మోదీ కొంతమంది పార్టీ నాయకుల దగ్గర ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.

Telugu Ap Bjp, Apcm, Ap, Bonda Uma, Budha Venkanna, Jagan Modi-Political

అంతేకాకుండా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీల నాయకులను, పోటీ చేసిన అభ్యర్థులను వెంటాడి వేధించడం మరికొంతమంది అసలు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, మాచర్లలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న వ్యక్తులు భౌతిక దాడులు చేయించడం ఇటువంటి అన్ని పరిణామాలను కేంద్ర బిజెపి పెద్దలు రాష్ట్ర బీజేపీ నాయకుల ద్వారా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి, జగన్ దూకుడు గురించి ఏపీ బీజేపీ నేతలు మోదీకి ఫిర్యాదు చేయడంతో తాను కూడా అన్ని విషయాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నానని, జగన్ కట్టడిచేసే సమయం వచ్చేసిందని మోదీ ఏపీ బీజేపీ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube