బాబు ని భయపెడుతున్న..మోడీ కేసీఆర్       2018-07-03   01:54:34  IST  Bhanu C

వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి కుప్ప కూలిదని ఒక సామెత ఉంటుంది..తెలుగు ప్రజలకి బాగా సుపరిచితమే అయితే ఈ సామెత సరిగ్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది తిరుగులోని నేతగా రాజకీయాలలో ఒక కొత్త వొరవడిని తీసుకు వచ్చిన చంద్రబాబు..హైటెక్ సీఎం గా పేరు సంపాదించారు..ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బాబు ని ఫాలో అయ్యేవారంటే ఆయన ముందు చూపు అభివృద్దిపై ఆయనకీ ఉన్న తపన ఎవరికీ అయినా సరే అర్థం అవుతుంది..

అయితే తన రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేకుండా తిరుగులేని నేతగా ఉన్న చంద్రబాబు ఒకే ఒక్క ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు..కేంద్రంపై ఒంటి కాలు తో రెచ్చిపోయే చంద్రబాబు ఓటుకు నోటు తరువాత చాలా లిమిటెడ్ గా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇదే ఏపీలో బీజేపి ని భూస్తాపితం చేయడానికి మాత్రం చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు చంద్రబాబు నాయుడు…అయితే ఈ పరిణామాలని గమనించిన మోడీ మళ్ళీ బాబు పై ఓటుకు అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్దపడ్డాడు..అందులో భాగంగానే కేసీఆర్ మోడీ భేటీ కూడా జరిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది..

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్ మోడీ ల భేటీ వార్త తెలుసుకున్న బాబు గారికి టెన్షన్ మొదలయ్యిందట…ఎక్కడ ఓటుకు నోటు కేసుని బయటకి తీస్తారోనని బాబు గారు ఆందోళన వ్యక్తం చెందు తున్నారట అయితే ఆ మధ్య కొన్ని నెలల క్రితం కేసీఆర్ పై చిర్రు బుర్రులాడిన చంద్రబాబు..ఆ పరిణామాలు తరువాత ఆ ఆమధ్య కేసీఆర్ పై చంద్రబాబు ధిక్కార స్వరం పెంచడంతో చిర్రెత్తు కొచ్చిన కేసీఆర్ ఓటుకు నోటు అస్త్రం బయటకి తీసి రెండు రోజులు హడావిడి చేసేసరికి బాబుగారికి షాక్ తగిలి సైలెంట్ అయ్యారట..అయితే ఏపీలో బీజేపి కి సమాధి కట్టడానికి ట్రై చేస్తున్న బాబు ఇప్పుడు మోడీ కేసీఆర్ భేటీ వలన తనకి ఎక్కడ ఎర్త్ పెడుటారో నని తెగ కంగారు పడుతున్నారట.

మోడీ మాత్రం ఏపీ లో ఈ సారి తెలుగుదేశం వస్తే మొదటికే మోసం వస్తుందని భావించి ముందస్తు ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే ఓటుకు నోటు కేసుని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది…ఏపీలో బాబు కి ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి అంటే ఇదొక్కటే అస్త్రం అనేది మోడీ వ్యూహంగా తెలుస్తోంది..ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం చంద్రబాబు రాజకీయ జీవితం వచ్చే ఎన్నికలతో సమాప్తం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.