మోడీ, షా యూటర్న్..ముందస్తు లేనట్లే

రాజకీయాల్లో ఈరోజు మాట్లాడిన మాటలు ఒక నిమిషం తరువాత పరిస్థితులకి అనుకూలంగా మారిపోతాయి.ఒక్క క్షణం చాలు నేతల మాటలు మాయమయ్యి పోవడానికి.

 Modi And Amit Shah Uturn About Lok Sabha Elections-TeluguStop.com

ఈ విషయంలో కేంద్రం పెద్దన్న బిజేపీ ముందు వరుసలో ఉంటుంది.నిన్నా మొన్నటి వరకూ కూడా ముందస్తు పై తెగ హడావుడి చేసిన బిజేపీ పెద్దలు ఇప్పుడు కప్పదాట వేస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే మరోసారి అధికారంలోకి వస్తామని.అదే సమయంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపించాలని తీవ్రంగా ఆలోచన చేసిన కేంద్రం ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయింది.

అయితే కేంద్రం ప్రకటనతో…కొన్ని పార్టీలు ముదస్తుకి మేము సిద్దమని ప్రకటిస్తే మరికొన్ని పార్టీలు మాత్రం వెనకడుగు వేశాయి ఈ దశలోనే ప్రాంతీయ పార్టీలకి అడ్డుకట్ట వేయడానికి జమిలి ఎన్నికలే అస్త్రంగా భావించిన కేంద్రం ప్రాంతీయ పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నా సరే ససేమిరా అన్నాయి.అయితే ఈ జమిలి ఎన్నికల కోసం ఎంతో పట్టుబట్టిన మోడీ ,షా లు ఇప్పుడు ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు.

ముదస్తుకి మేము సిద్దంగా లేమంటూ కేంద్రం తమ నేలతతో లీకులు ఇస్తోంది.అందుకు తగ్గట్టుగానే పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ ఘడ్కరీ కూడా ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు.

అయితే జమిలి ఎన్నికలకోసం పట్టు బట్టిన కేంద్రం ఎందుకు ఒక్కసారిగా వెనకడుగు వేసిందంటే.దానికి విశ్లేషకులు భిన్నమైన వాదనలు చెప్తున్నారు…వాటిలో భాగంగా.ఎట్టి పరిస్థితుల్లోనూ ‘జమిలి’ ఎన్నికలు సాధ్యకాదని తేలిపోవడం.ప్రాతీయ పార్టీలలో బిజేపీ పై నెలకొన్న అసంతృప్తి వలన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల్లో గెలవమనే భయంతో.వ్యూహం మార్చినట్లుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు.ఇప్పుడు ఎన్నికలకు వెళ్లడం కంటే షెడ్యూల్‌ ప్రకారం వెళితేనే నయమన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనతోనే.

వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలాఉంటే అదే సమయంలో నాలుగేళ్ళలో దేశానికి కేంద్రం ఏమి చేసింది రాష్ట్రాలకి ఎలా సహకరిచింది అనే విధంగా ఒక ప్రత్యెక ప్రణాళికని రూపొందిస్తోందట.

అంతేకాదు దేశ వ్యాప్తంగా ‘మోడీ’ సుడిగాలి పర్యటన చేయాలని ఈ పర్యటన ద్వారా ప్రజలలో కేంద్రపై ఉన్న కోపాన్ని తగ్గించి బిజేపీ కి మళ్ళీ కొత్త ఊపు తీసుకురావాలనేది మోడీ షా ల వ్యూహంగా తెలుస్తోంది.అందుకే ముందస్తుకు పోకుండా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిపించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube