వారణాసికి నేను రాకపోవచ్చు : మోడీ  

Modi About Varanasi Elections 2019 మోడీ-bjp,elections 2019,modi,pm Modi,varanasi,నరేంద్ర మోడి,ప్రధాని నరేంద్ర మోడి,మోడి

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత ఎన్నికల్లో ప్రాతినిధ్య వహిస్తున్న వారణాసి పార్లమెంటు స్థానంకు చివరి దశలో ఎన్నిక జరుగబోతుంది. మరో నాలుగు రోజుల్లో చివరి దశ ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారంకు సమయం ఉంది..

వారణాసికి నేను రాకపోవచ్చు : మోడీ-Modi About Varanasi Elections 2019 మోడీ

ఈ సమయంలో తాను వారణాసికి ఎన్నికల ప్రచారం కోసం రాలేను అంటూ మోడీ తాజాగా ఒక వీడియో సందేశంను వారణాసి ఓటర్లకు ఇవ్వడం జరిగింది.గతంలో తాను వారణాసి వచ్చిన సమయంలో మీరు ఎన్నికల ప్రచారం కోసం మరోసారి మీరు వారణాసి రానక్కర్లేదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నాకు సూచించారు. ఆ మాటలు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చాయి.

అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. అందుకే వారణాసి రాలేక పోతున్నాను.ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని మరోసారి నన్ను ఆశీర్వదించగలరు అంటూ మోడీ కోరాడు.

కాశీలోని ప్రతి ఒక్కరు కూడా మోడీ గెలవాలని కోరుకుంటున్నట్లుగా నాకు తెలుసు. తప్పకుండా కాశీ వాసుల కోరిక నెరవేరుతుంది, దేశం ముందడుగు వేసేందుకు మరోసారి విజయాన్ని దక్కించుకుంటామంటూ మోడీ ధీమా వ్యక్తం చేశాడు.