జూలై 15 నుండి మోడర్నా వ్యాక్సిన్లు..!

భారత్ లో ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా త్వరలో ప్రజలకు ఇవ్వనున్నారు.దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Moderna Corona Vaccine Available At Govt Hospitals From July 2nd Week, Availabl-TeluguStop.com

మోడర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర అనుమతులు మంజురైన నేపథ్యంలో జూలై 15 నుండి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి.భారత్ లో మోడర్నా వ్యాక్సిన్ల పంపిణీకి ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్రమంలో వ్యాక్సిన్ డోసులను సిప్లా దిగుమతి చేసుకుంటుంది.వచ్చే వారం నుండి వీటిని దేశంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచనున్నారు.

మోడర్నా వ్యాక్సిన్ డోసులు పొందిన తొలి వంద మంది ఆరోగ్యాన్ని వారం రోజులు పాటు పరిశీలించి ఆ నివేదికను డీసీజీఐ కి సిప్లా సమర్పించాల్సి ఉంటుంది.ఈ షరతులపైనే మోడర్నా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చారు.

ఎం.ఆర్.ఎన్.ఏ సాంకేతిక ఆధారంగా అభివృద్ధి చేసిన మోడర్నా కరోనా వ్యాక్సిన్ సమర్ధత 90 శాతం పైనే ఉండటం విశేషం.అమెరిక, యూరప్ దేశాల్లో మోడర్నా టీకాల పంపిణీ ఎప్పటినుండో జరుగుతుంది. ప్రజలకు మోడర్నా వ్యాక్సిన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube