ట్రంప్ కు నిరాశే.. వ్యాక్సిన్ రావడం కష్టమేనట..?

ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా, భారత్, బ్రెజిల్ పై తీవ్ర ప్రభావం చూపింది.కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.

 Moderna Company Corona Vaccine, Donald Trump, Corona Vaccine, Moderna, America E-TeluguStop.com

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల కంటే ముందే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు.

అయితే తాజాగా మోడెర్నా సంస్థ చేసిన ప్రకటన ట్రంప్ ఆశలపై నీళ్లు జల్లింది.

ఇప్పటివరకు చేసిన క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు సాధించిన మోడెర్నా ప్రస్తుతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.వ్యాక్సిన్ గురించి మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫేన్ బాన్సిల్ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి నవంబర్ 25వ తేదీ వరకు సమయం పట్టవచ్చని వెల్లడించారు.

మరోవైపు ఫైజర్ కంపెనీ సైతం వ్యాక్సిన్ సమర్థత గురించి తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుందని చెబుతోంది.

వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.దీంతో ఎన్నికలు జరిగే నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

వ్యాక్సిన్ పై కీలక ప్రకటనలు చేసిన ట్రంప్ కు నిరాశే ఎదురు కానుంది.

ట్రంప్ జో బిడెన్ తో జరిగిన చర్చలో సైతం వ్యాక్సిన్ ను ఖచ్చితంగా అందుబాటులో తెస్తామని వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కంపెనీలపై ఒత్తిడి పెంచి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెప్పిస్తారా.? చూడాల్సి ఉంది.మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.వైరస్ బారిన పడితే భవిష్యత్తులో సైతం ఇతర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

భారత్ లో గతంతో పోలిస్తే కరోనా ప్రభావం తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube