ఆడియెన్స్ ని మెప్పిస్తున్న మోడరన్ లవ్ హైదరాబాద్..!

ఇదివరకు సినిమా చూడాలంటే థియేటర్ కి మాత్రమే వెళ్లి చూసేవాళ్లు.ఓటీటీల వల్ల థియేటర్ లో చూడలేని కొన్ని కథలను వెబ్ సీరీస్ ల ద్వారా చూడగలుగుతున్నారు.

 Modern Love Hyderabad Web Series Gets  Positive Talk From Audiance,modern Love H-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో వెబ్ సీరీస్ లు ఆడియెన్స్ మెప్పు పొందగా లేటెస్ట్ గా ఓ తెలుగు వెబ్ సీరీస్ గురించి సోషల్ మీడియాలో బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.అదే మోడరన్ లవ్ హైదరాబాద్.

ఆరు కథలుగా వచ్చిన ఈ వెబ్ సీరీస్ అమేజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ లో రిలీజ్ అయ్యింది.

జూలై 8న ఈ మోడరన్ లవ్ హైదరాబాద్ వెబ్ సీరీస్ రిలీజైంది.

ఈ వెబ్ సీరీస్ ని తెలుగు యంగ్ దర్శకులు వెంకటేష్ మహా, నగేష్ కుకునూర్, ఉదయ్ గుర్రాల, దేవిక, రంజిత్ ఝా డైరెక్ట్ చేశారు.ఇక ఈ వెబ్ సీరీస్ లో ఆది పినిశెట్టి, అభిజిత్, కోమలీ ప్రసాద్, నిత్యా మీనన్, రేవతి, నరేష్ అగస్త్య నటించారు.

సీనియర్ యాక్టర్స్ నరేష్, సుహాసిని కూడా ఈ వెబ్ సీరీస్ లో నటించారు.

ఆరు విభిన్న కథలతో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ ఒక్కొక్కటి ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.

తెలుగు ఆడియెన్స్ కి ఈ వెబ్ సీరీస్ బాగా నచ్చేసింది.అందుకే సోషల్ మీడియాలో మోడరన్ లవ్ హైదరాబాద్ గురించి హడావిడి చేస్తున్నారు.

ఇందులో నటించిన యంగ్ టీం కూడా బాగా నటించారని ప్రశంసలు అందుకుంటున్నారు.అమేజాన్ ప్రైమ్ లో ఈమధ్య వచ్చిన వెబ్ సీరీస్ లలో ఇదే మంచి టాక్ తెచ్చుకుంది.

వెబ్ మూవీ లవర్స్ కి ఈ వెబ్ సీరీస్ సూపర్ ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది.అయితే కొద్దిగా ప్రమోషన్స్ లాంటివి చేసి ఉంటే ఖచ్చితంగా ఈ వెబ్ సీరీస్ కు ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube