ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో నుండి భారీగా డబ్బులు డిమాండ్ చేసిన మహిళ..! ఎందుకంటే..?!

ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో టాప్ రొనాల్డోనే.

 Model Kathryn Mayorga Demands 56 Million Pounds To Cristiano Ronaldo For Rape Ac-TeluguStop.com

ఈ మేటి ఆటగాడి లైఫ్ చాలా స్టైలిష్, రిచ్ గా ఉంటుంది.ఇంతలా పేరుతెచ్చుకున్న ఆయనపై తాజాగా ఓ ఆరోపణ ఎదురైంది.

తనని రొనాల్డో అత్యాచారం చేశాడని ఒక మోడల్ తీవ్ర ఆరోపణలు చేసింది.మాజీ మోడల్ కాథరిన్ మయోర్గా ఈ అత్యాచారం ఆరోపణలు చేయడమే కాకుండా తనకు నష్టపరిహారం కింద 56 మిలియన్ పౌండ్లు అంటే సుమారు రూ.579 కోట్లు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది.గతంలో జరిగిన ఘటన వల్ల అనుభవించిన బాధకు, రాబోయే రోజుల్లో తాను అనుభవించాల్సిన బాధకు, మొత్తానికి తనకు జరిగిన అన్యాయానికి కలిపి రూ.579 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది.ఈ ఘటనతో రొనాల్డో అభిమానులు ఆ మోడల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ మోడల్ అడిగిన మొత్తం రొనాల్డో జువెంటస్ క్లబ్‌కు ఆడితే రెండేళ్లకు వచ్చే జీతంతో సమానం కావడం గమనార్హం.2009లో లాస్‌వెగాస్‌లోని ఒక నైట్ క్లబ్‌లో రొనాల్డో తనను కలిశాడని, ఆ తర్వాత తన హోటల్ రూమ్‌కు తీసుకొని వెళ్లి అత్యాచారం చేసినట్లు మోడల్ కాథరిన్ ఆరోపించింది.

ఆ మోడల్ ను అత్యాచారం చేశారంటూ చేసిన ఆరోపణలను రొనాల్డో తీవ్రంగా ఖండించాడు.మయోర్గా 2010లోనే కోర్టు బయట 2,70,000 పౌండ్లకు సెటిల్‌మెంట్ చేసుకున్నదని రొనాల్డో చెబుతున్నాడు.

ఆ రోజు ఇద్దరి పరస్పర సహకారంతో సరదాగా గడిపినా ఆమె తనపై అనవసరమైన ఆరోపణలు చేసి కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.పదేళ్ల కిందటే ఆమెతో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు రొనాల్డో తెలిపాడు.

అయితే 2017లో ఇదే కేసును తిరిగి తెరిపించిందని, తాను అప్పుడు జరిగిన దాని నుంచి బయటపడలేకపోతున్నానని రొనాల్డ్ ఆవేదన వ్యక్తం చేశాడు.మానసికంగా కుంగిపోయానని చెప్పి కేథరిన్ మయోర్గా మళ్లీ కేసు వేసిందని రొనాల్డో అంటున్నారు.

కాగా తనతో బలవంతంగా సెటిల్‌మెంట్ చేయించారని మయోర్గా ఆరోపిస్తున్నట్లు ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది.మయోర్గా లీగల్ టీమ్ దాదాపు 60 మంది సాక్ష్యులతో కూడిన లిస్టును తయారు చేసి వీరందరినీ కోర్టు లీగల్ విచారణ జరపాలని కోరుతోంది.

ఆ లిస్టులో బిగ్ బ్రదర్ షో మాజీ జస్మిన్ లెన్నార్డ్ కూడా ఉంది.మొత్తానికి ఈ కేసు ఎంత వరకూ వెళ్తుందో వేచిచూడాల్సిందే.రొనాల్డో నష్టపరిహారం చెల్లిస్తాడా? లేడా అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube