ఫ్యాషన్‌ షో స్టేజ్‌పై క్యాట్‌ వాక్‌ చేస్తూ కుప్పకూలిన మోడల్‌.. అసలేం జరిగింది?

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.ఈ క్షణం వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మరుక్షణంలో ఏదైనా ప్రమాదంతో మృతి చెందవచ్చు, లేదంటే ఏదైనా అనారోగ్యంతో చనిపోవచ్చు.

 Model Fell Down In A Fashion Show-TeluguStop.com

ఈ జీవితంకు అస్సలు నిలకడ అనేది ఉండదు.అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో ప్రతి క్షణంను కూడా మనిషి ఎంజాయ్‌ చేయాలని కొందరు అంటూ ఉంటారు.

వచ్చే క్షణంకు ఏం జరుగుతుందో భయంతో కొందరు జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు.కాని ఎప్పుడో జరుగబోతున్న దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు అనే వారే ఆనందమైన జీవితాన్ని గడుపుతారు.

తాజాగా బ్రెజిల్‌కు చెందిన టేల్స్‌ సోరేస్‌ అనే ఒక మేల్‌ మోడల్‌ మరణం స్థానికంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తం చేసేలా ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బ్రెజిల్‌కు చెందిన టేల్స్‌ సోరేస్‌ గత కొంత కాలంగా మోడలింగ్‌లో రాణిస్తున్నాడు.ఇతడు చేసిన షోలు పలు సక్సెస్‌ అయ్యాయి.

ఎన్నో సార్లు మోడలింగ్‌ సమయంలో బహుమానాలు కూడా పొందాడు.స్థానికంగా పలు కంపెనీలకు బ్రాండ్స్‌కు షూట్‌ చేసిన యాడ్స్‌లో నటించాడు.

మంచి భవిష్యత్తు ఉందని అతడి గురించి అంతా అనుకున్నారు.అయితే అనూహ్యంగా పాతికేళ్ల వయసులోనే అతడికి నిండు నూరేళ్లు నిండాయి.

అత్యంత దారుణమైన పరిస్థితులు అతడి మరణంకు కారణం కాదు, కనీచం చిన్న ముల్లు కూడా అతడిని గుర్చుకోలేదు.కాని అతడు మాత్రం మృతి చెందాడు.

తాజాగా ఒక ప్యాషన్‌ షోలో అతడు పాల్గొన్నాడు.అందరు మోడల్స్‌ మాదిరిగానే వయ్యారాలు పోతూ నడవడం మొదలు పెట్టాడు.నవ్వుతూ తన నడక మొదలు పెట్టిన టేల్స్‌ కొన్ని అడుగులు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు.అతడి పరిస్థితి ఏం అర్థం కాలేదు.

కుప్పకూలిన టేల్స్‌ లేస్తాడని అంతా చూశారు.కాని అతడు ఎంతకు లేవక పోవడంతో అతడి దగ్గరకు వెళ్లారు.

అతడు ఉలుకు పలుకు లేకుండా ఉండేప్పటికి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు.హాస్పిటల్‌కు తీసుకు వెళ్తే అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైధ్యులు చెప్పాడు.

అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube