ఇకపై ఇంటి దగ్గరికే మొబైల్ సిమ్ కార్డులు..!

సాధారణంగా కొత్త సిమ్స్ తీసుకోవాలంటే మొబైల్ షాప్ లకు వెళ్లాల్సి వచ్చేది.లేదా సిటీ సెంటర్ వద్దకు వెళ్లి సిమ్ములు విక్రయించేవారిని అన్వేషించాల్సి వచ్చేది.

 Mobile Sim Cards Closer To Home Now   Mobile , Sim Card, Latest News, Updates Ne-TeluguStop.com

ఒక కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే చాలా తతంగమే పాటించాల్సి వస్తోంది.అయితే ఈ క్రమంలోనే భారతీయ టెలికాం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త మొబైల్‌ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టెలికం శాఖ (డాట్‌) నూతలు మార్పులు తీసుకువచ్చింది.ఈ నూతన మార్పులతో ఇకపై ఆన్‌లైన్‌లోనే సిమ్ కార్డుల కనెక్షన్‌ కోసం దరఖాస్తు వేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లోనే ఆధార్‌ కార్డు కూడా సమర్పించి వెరిఫికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయొచ్చు.లేదా డిజిలాకర్‌లోని మరేతర ఐడెంటిటీ డాక్యుమెంట్స్ సాయంతోనైనా వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఈ ప్రాసెస్ మాత్రం ముగిసిన అనంతరం నేరుగా మీ ఇంటి వద్దకే సిమ్ కార్డు వస్తుంది.అయితే ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ సర్వీసులను వాడుకున్నందుకు గాను మొబైల్ కస్టమర్లు యూఐడీఏఐకి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది.
Telugu Delivery, Latest, Ups-Latest News - Telugu

కేంద్ర ప్రభుత్వం టెలికం రంగ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులను తెస్తోంది.ఇందులో భాగంగా తాజాగా సిమ్ కార్డు హోమ్ డెలివరీని పరిచయం చేసింది.ఇప్పుడు మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకున్న వారు రిటైల్ షాప్ లకు వెళ్లాల్సి వస్తోంది.

ప్రీ–పెయిడ్‌ నుంచి పోస్ట్‌–పెయిడ్‌కు లేదా పోస్ట్‌ పెయిడ్‌ నుంచి ప్రీ–పెయిడ్‌ కనెక్షన్‌కు మారాలనుకునే వినియోగదారులు కూడా ఫిజికల్ గా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి వస్తోంది.ఒక గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ చేతపట్టుకొని రిటైల్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.కానీ ప్రస్తుత ఆన్‌లైన్‌ యుగంలో .అందులోనూ కరోనా సమయంలో కాంటాక్ట్‌లెస్ సేవలు అందించాల్సిన అవసరం నెలకొంది.అందుకే ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టి సిమ్ సబ్‌స్క్రయిబర్స్‌కు మరింత సౌకర్యమైన సేవలను ప్రవేశపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube