మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుందా..? అయితే ఇవి కచ్చితంగా మీరు పాటించాల్సిందే…!  

Mobile Phones Memorey Card Mobile Apps - Telugu Memorey Card, Mobile Apps, Mobile Phones, Mobile Phones Virus, Phone Hang, Smart Phones

ప్రస్తుత మనిషి జీవితకాలంలో గాలి, నీరు, తిండి, గుడ్డ, ఉండటానికి ఇల్లు తో పాటు చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే అవసరం అయిపోయింది.ఇక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే… ఎవరికి తహత తగ్గట్టు వారు ధరని వెచ్చించి స్మార్ట్ ఫోన్లను కొంటున్నారు.

 Mobile Phones Memorey Card Mobile Apps

తక్కువ బడ్జెట్ లో నుండి మీ ఊహకు అందనంత ధరలకు కూడా మార్కెట్ లో వేలకొద్ది మోడల్స్ దొరుకుతున్నాయి.అయితే వీరందరికీ ఎదురయ్యే ఒక సమస్య ఫోన్ హ్యాంగ్ అవ్వడం.

తక్కువ బడ్జెట్ ఫోన్ అయినా సరే, భారీ బడ్జెట్ ఫోన్ అయినా సరే మొబైల్ కొన్న కొద్దిరోజులకు ఈ సమస్య ఫోన్ లో తలెత్తుతుంది.

మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుందా.. అయితే ఇవి కచ్చితంగా మీరు పాటించాల్సిందే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒక్కోసారి ఫోన్ హ్యాంగ్ అయిపోతే దానిని రీస్టార్ట్ చేస్తేనే కాని తిరిగి పని చేయదు.

లేకపోతే అలాగే ఉండిపోతుంది.దీనికి ప్రధాన కారణం మొబైల్ లో వైరస్ చొరబడడం.

అయితే వీటి నుండి తప్పించుకోవడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సులువుగా అలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.ఇక వాటి విషయం చూస్తే… నిజానికి చాలామంది వారి స్మార్ట్ ఫోన్ లో అవసరం లేని కొత్త యాప్స్ కూడా ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు.

ఒకవేళ వీటిని మీరు ఎక్కువగా వాడకపోయినా సరే, అవి ఫోన్ లోని స్పేస్ ను ఆక్రమించి ఫోన్ వేగాన్ని చాలావరకు తగ్గించేస్తాయి.ఇది కూడా ఫోన్ హ్యాంగ్ అవడానికి ప్రధానమైన విషయం.

కాబట్టి మీరు ఏవైతే యాప్స్ ను ఎక్కువగా వాడారో, లేకపోతే అవసరం లేదో వాటిని మీ ఫోన్ నుండి తొలగిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇక మరొక సమస్య విషయం కొస్తే… తాజాగా మార్కెట్లో ఎక్కువ మెమొరీ ఉన్న కొన్నివేల మెమొరీ కార్డులు అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి.అయితే వాటికి ఎంత దూరంగా ఉంటే మీ మొబైల్ అంత సురక్షితంగా ఉంటుంది.దీనికి కారణం మీరు మెమొరీ కార్డు ఉపయోగించడం ద్వారా వైరస్ సోకే ఛాన్సులు ఎక్కువ.

దీనితో మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది.కాబట్టి మెమొరీ కార్డు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు.

అలాగే మీ ఫోన్ మెమొరీ స్టోరేజ్ లో 80 శాతం కంటే ఎక్కువగా మీడియా ఫైల్స్ ఉంటే, అది కూడా మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి దారితీస్తుంది.కాబట్టి మీ ఫోన్లో అనవసరపు మీడియా ఉండే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మీ ఫోన్ హ్యాంగ్ అవ్వదు.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఫోన్ ఎక్కువ రోజులు హ్యాంగ్ అవ్వకుండా పనిచేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test