తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం కొత్త పథకం ను ప్రవేశ పెట్టింది.దీని ద్వారా మహిళలు ఉపాది పొందుతారని తెలిపింది.
అందుకోసం 60 శాతం సబ్సిడీ తో ఈ పథకంను ప్రవేశ పెడుతుంది.మొత్తం హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి.
డివిజన్ కి ఒక్క వెహికిల్ చొప్పున మొత్తం 150 మొబైల్ షిప్ ఔట్ లెట్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.ఒక్కో వాహనం ఖరీదు 10 లక్షలు పడుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది.
ఇక నుండి హైదరాబాద్ నగర ప్రజలు చేపల కోసం నేరుగా మార్కెట్ కు వెళ్లాలిసిన అవసరం లేదు.నేరుగా వారి ఇంటివద్దకు చేపలను, వాటి వంటకాలను తెచ్చేందుకు ప్రభుత్వం ఈ వినూత్న స్కీంను మొదలు పెడుతుంది.
దీని ద్వారా మత్సకారులు లబ్ది పొందుతారని ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈ విషయంపై హైదరాబాద్ మత్స సంఘం అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై టిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో ఎన్నో కొత్తపథకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ తో హైదరాబాద్ ప్రజలకు నోటికి నోరూరించే ఫిష్ ఫ్రై, కర్రీ లను అందించనున్నది.