బాత్రూంలో మొబైల్ కెమెరా.. లోపలికి వెళ్లిన మహిళా లీడర్.. సీన్ కట్ చేస్తే..

సమాజంలో ఆకతాయిలు, మహిళలను ఏడిపించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.దీనికి తోడు బాత్రూంలలో సీక్రెట్‌గా కెమెరాలు పెట్టడం, తర్వాత వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం లేదంటే బాధితురాలి లోబర్చుకుని డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

 Mobile Camera In The Bathroom Female Leader Who Went Inside If The Scene Is Cut , Camera In Bathroom , Viral News ,cm Stalin , Tamilnadu , Amma Bhojanam , Jayalalitha , Kindi Railway Station In Chennai-TeluguStop.com

ఇలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.

తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం స్టాలిన్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.వారికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

 Mobile Camera In The Bathroom Female Leader Who Went Inside If The Scene Is Cut , Camera In Bathroom , Viral News ,CM Stalin , Tamilnadu , Amma Bhojanam , Jayalalitha , Kindi Railway Station In Chennai-బాత్రూంలో మొబైల్ కెమెరా.. లోపలికి వెళ్లిన మహిళా లీడర్.. సీన్ కట్ చేస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆఫీస్ లను తనఖీ చేస్తూ అధికారులను ఉరుకులు పెట్టిస్తున్నారు.

ఇప్పటికే జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ భోజనం పథకాన్ని అదే పేరుతో కంటిన్యూ చేస్తూ విమర్శలకు ప్రశంసలు సైతం పొందుతున్నారు.

ఇలాంటి పార్టీలో ఓ మహిళా నేత భారతి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.చెన్నైలోని మధురవాయల్ నియోజకవర్గానికి ఆమె ఆర్గనైజర్‌ గా వ్యవహరిస్తూ అక్కడి వ్యవహారాలను నిర్వహిస్తున్నారు.

ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నారు.

ఆ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమె నిత్యం నాయకులు, కార్యకర్తలతో మీటింగ్స్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే చెన్నైలోని కిండి రైల్వే స్టేషన్ సమీపంలో మధ్యాహ్నం టైంలో భోజనం చేసేందుకు అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్ లోకి వెళ్లారు ఆమె.అందులోని రెస్ట్ రూంలోకి వెళ్లడంతో ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది.పైన ఒక అట్టముక్క కనిపించింది.దానిని తీసి చూడగా అందులో మొబైల్ ఫోన్ ఉంది.దాంట్లో రెస్ట్ రూం దృశ్యాలన్నీ రికార్డు అవుతున్నాయి.దీనిని గమనించిన ఆమె.వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.ఆ ఫోన్ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆమె చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

Video : Mobile Camera In The Bathroom Female Leader Who Went Inside If The Scene Is Cut , Camera In Bathroom , Viral News ,CM Stalin , Tamilnadu , Amma Bhojanam , Jayalalitha , Kindi Railway Station In Chennai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube