మీ మొబైల్ ఫోన్స్ పేలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

ఈ కాలంలో ఎవరి చేతిలో చూసిన మొబైల్ వినియోగం అనేది బాగా ఎక్కువ అయిపోయింది.తిండి లేకపోయినా బతకగలరేమో గాని చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు.చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది బాగా ఎక్కువ అయిపోయింది.24 గంటలు ఫోన్ లో ఆటలు ఆడటం, యూట్యూబ్ లో వీడియోలు చూడటమే పని అయిపోయింది.అయితే ఇలా ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఒక్కోసారి మనం వాడే స్మార్ట్‌ఫోన్‌ లు పేలిపోతున్న ఘటనలు మనం చాలానే చూసి ఉంటాము.

 Mobile‌ Tips, Care, Technolgy Updates, Latest News, Cell Phones,latest News,ba-TeluguStop.com

ఇలా మొబైల్ పేలిపోవడం వల్ల ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఎన్నో వింటూనే ఉన్నాము.అయితే చాలామందికి అసలు మొబైల్ ఫోన్ లు ఎందుకు పేలుతున్నాయి అనే విషయాలపై అవగాహన అనది లేదు.

కాబట్టి మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను మనం తెలుసుకుందాం.

నిజానికి స్మార్ట్ ఫోన్‌ లు పేలడానికి అందులో ఉండే బ్యాటరీ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

సాధరణంగా స్మార్ట్‌ ఫోన్ లలో వాడే బ్యాటరీలు అన్ని లిథియం అయాన్ తోనే తయారువుతాయి.వీటి వలన బ్యాటరీలు పేలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

చాలామంది పగటి పూట ఫోన్ లోని ఛార్జింగ్ అంతా అవ్వకొట్టేసి రాత్రి పూట పడుకునే సమయంలో ఛార్జింగ్ పెట్టి అలా ఉదయం వరకు వదిలేస్తారు.అలా చేయడం వలన ఫోన్ లో 100 శాతం ఛార్జింగ్ ఎక్కినాగాని ఇంకా విద్యుత్ అనేది ఫోన్ లోకి సరఫరా అవుతూనే ఉంటుంది.

అలాంటి సమయంలో ఫోన్ లో వేడి ఎక్కువ అయిపొయి పేలిపోయే ప్రమాదం ఉంది.అందుకనే ఫోన్ కు ఎప్పుడు కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టడం గాని లేదంటే ఛార్జింగ్ పెట్టి గంటల తరబడి వదిలేయడం గాని చేయకండి.

అలాగే మన చేతిలో నుంచి స్మార్ట్ ఫోన్ ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది కదా.అలాంటి సమయంలో ఫోన్ లో ఉన్న బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.కింద పడినప్పుడు మనకు ఎలా లోపల భాగాల్లో దెబ్బలు తగులుతాయో ఫోన్ కూడా అంతే.బ్యాటరీ లోపలి భాగాలు పాడయినా, లేదంటే పార్ట్స్ మిస్ మ్యాచ్ అయినాగానీ షార్ట్ సర్క్యూట్‌ జరిగి మండిపోతాయి.

Telugu Care, Cell, Latest, Technolgy Ups, Tips-Latest News - Telugu

మరొక ముఖ్య విషయం ఏమిటంటే.తక్కువ రేట్ కి వస్తున్నాయి కదా అని నాణ్యతలేని బ్యాటరీలను వాడటం వలన ఫోన్లు పేలిపోవడం జరుగుతుంది.అందుకని ఎప్పటికప్పుడు కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు చార్జర్ లు వాడటం మంచిది.అలాగే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే. ఫోన్ ఛార్జింగ్ పెట్టి పక్క వాళ్లతో ఫోన్ మాట్లాడటం.ఇలా ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి బ్యాటరీ పేలే అవకాశాలు ఉన్నాయి.

అలాగే మీరు వాడుతున్న ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఎప్పుడైనా ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ నుంచి ఆ బ్యాటరీని తొలగించండి.ఫోన్ చార్జింగ్ లో ఉన్నప్పుడు ఆటలు ఆడటం, పాటలు వినడం వంటివి అస్సలు చేయకూడదు.

రాత్రిపూట పడుకునేటప్పుడు ఫోన్ ని పక్కన పెట్టుకొని పడుకోరాదు.ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ ఫోన్ పని చేయకపోతే మీరే సొంత ప్రయోగం చేసి ఫోన్ లో ఉన్న బ్యాటరీలను, మిగతా వస్తువులను తీసే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి.

ఫోన్ ను గ్యాస్‌ స్టవ్‌ లకు, వేడి హీటర్ల లాంటి వాటికి కాస్త దూరంగా ఉంచండి.మీ ఫోన్‌ నీళ్లలో పడిపోతే కంగారుపడి ఛార్జింగ్ మాత్రం పెట్టకండి.

తేమ పూర్తిగా పోయాకే ఛార్జింగ్‌ పెట్టాలి.ఇలా ఫోన్ బ్యాటరీ విషయంలో పైన జాగ్రత్తలు పాటిస్తూ ఫోన్ పేలుళ్లకు దూరంగా ఉండండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube