తెలుగు సినీ నటుడు జేడీ చక్రవర్తి.ఈయన నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేశారు.తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి.హీరోగానే కాకుండా కొన్ని సినిమాలలో సహాయనటుడిగా నటించారు.ఈ నటించిన సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమాలో తొలిసారిగా పరిచయమయ్యాడు.ఈయన నాలుగు సినిమాలలో దర్శకత్వం వహించగా మంచి గుర్తింపుతో విజయం పొందాయి.దాదాపు 36 సినిమాలకు పైగా నటించిన జేడీ.చాలా రోజుల తర్వాత MMOF/70MM సినిమా లో నటించగా ఫిబ్రవరి 26న విడుదలైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తో ఆయనకు ఎఫైర్ గురించి యాంకర్ ప్రశ్నించగా తన స్టైల్లో జవాబు చెప్పాడు.
ఇటీవల విడుదలైన ఆయన సినిమాకు మంచి స్పందన రాగా.ఈ సినిమా గురించి యూట్యూబ్ ఛానల్ జేడీ ను ఇంటర్వ్యూ చేశారు.లాస్య అనే యూట్యూబ్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే జవాబిచ్చాడు.ఆయన నటించిన గులాబీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ మహేశ్వరి తో ఆ సమయంలో వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని వార్తలు కూడా వచ్చాయి.గతంలో జరిగిన ఇష్యూ గురించి యాంకర్ లాస్య జేడీని ప్రశ్నించింది.
అప్పట్లో మీతో నటించిన హీరోయిన్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉన్నారా? ‘సిస్టర్ మహేశ్వరి‘ అని అంటారు గా ఆమె టచ్ లో ఉన్నారా అని ప్రశ్నించింది.దీంతో వెంటనే జేడీ ‘సిస్టర్ మహేశ్వరి అని నీతో చెప్పానా’.? అని నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కదా అలా చెప్పి ఉంటాను.నీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలా సిస్టర్ మహేశ్వరి కాదు.
అక్క మహేశ్వరి అంటూ జవాబిచ్చాడు.అంతేకాకుండా పరాయి స్త్రీని, పరాయి ధనాన్ని ఆశించడం తప్పు.
ఆ అమ్మాయి నాతో నటించినంత మాత్రాన ఆమె తనకు ఉంటాయా చెప్పు? అంటూ వయసులో ఆమె కంటే నేను 1,2 ఏళ్ళు పెద్ద ఉంటాను కానీ.ఇంటలిజెన్స్ లో మ్యాగీ కంటే చిన్నోడిని అని తనదైన శైలిలో యాంకర్ కు సమాధానమిచ్చాడు.
దీంతో వెంటనే యాంకర్ అయితే మ్యాగీ తన ముద్దు పేరా అని ప్రశ్నించగా.ఇక ఆమెకు కౌంటర్లతో సమాధానమిచ్చారు.