ఆదిపురుష్‌లో కీరవాణి రాగం.. రెహమాన్ సంగతేమిటి?  

MM Keeravani To Give Music For Adipurush, MM Keeravani, Adipurush, Prabhas, AR Rehman, Om Raut - Telugu Adipurush, Ar Rehman, Mm Keeravani, Om Raut, Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది.

TeluguStop.com - Mm Keeravani To Give Music For Adipurush

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

TeluguStop.com - ఆదిపురుష్‌లో కీరవాణి రాగం.. రెహమాన్ సంగతేమిటి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా తరువాత ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు.

ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ను చిత్ర యూనిట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు అవి కేవలం పుకారే అని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగించినట్లు తెలుస్తోంది.ప్రభాస్‌కు బాహుబలి వంటి బిగ్గెస్ట్ మూవీకి సంగీతం అందించిన కీరవాణి అయితేనే ‘ఆదిపురుష్’కు కూడా పూర్తి న్యాయం చేయగలడని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఇక కీరవాణి ఈ సినిమాకు నిజంగానే సంగీతం అందిస్తున్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే పీక్స్‌కు చేరుకున్నాయి.

#MM Keeravani #Ar Rehman #Om Raut #Adipurush #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mm Keeravani To Give Music For Adipurush Related Telugu News,Photos/Pics,Images..