తెలంగాణ రాష్ట్ర డీజీపీ నుండి ప్రశంసలు అందుకున్న కీరవాణి.. ఎందుకో తెలుసా..?

తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి పోలీసులను ఉద్దేశించి ఓ పాటని స్వరపరిచారు.ఈ పాటని ఆయన తెలంగాణ పోలీస్ ‘ ప్రాణం పంచే మనసున్న పోలీస్ ‘ అంటూ పాటని స్వరపరిచారు.

 Telangana Dgp Mahendar Reddy Praises Mm Keeravani Song, Mm Keeravani Song On Pol-TeluguStop.com

ఈ పాటను తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు.తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ స్వరపరిచిన ఈ పాటని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతగానో మెచ్చుకున్నారు.

ఈ పాట తాజాగా డీజీపీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తెలంగాణ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు చాలా మంది పాల్గొన్నారు.

ఇకపోతే ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రచించారు.గత నెలలో నిర్వహించిన పోలీస్ ప్లాడ్ డే కార్యక్రమాలకు సందర్భంగా ఈ పాటని స్వర పరిచినట్లు తెలుస్తోంది.

ఈ పాటను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ సందర్భోచితంగా ఈ పాట ఉందని ఆయన చెప్పుకొచ్చారు.పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొనే కష్టాల గురించి అలాగే వారికి ఎదురయ్యే ఇబ్బందులను గురించి వివరిస్తూ పోలీసులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ పాటను ఉద్దేశించి సేవలందిస్తూ ఉంటే మనతో ఎంతో మంది కలిసి వస్తారు అనడానికి ఈ అద్భుతమైన పాట నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.

ముందు ముందు ప్రజలలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు కూడా వస్తాయని ఆ దిశగా పోలీసులు అందిస్తున్న సేవల గురించి సంగీత దర్శకుడు కీరవాణి పోలీసులను ప్రశంసించారు.అలాగే ఆయన గతంలో తనకు 9 సంవత్సరాలు ఉన్న సమయంలో తన మొదటి కార్యక్రమం పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చారంటూ ఆయన చెప్పుకొచ్చారు.1998లో ‘ఇస్తున్న ప్రాణం మీకోసం అనే పోలీస్ త్యాగాలను’ తెలియజేసే ఈ పాటను అప్పట్లో ఆలపించాను అని చెప్పుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం పాడిన పాటను తాను హిందీలో కూడా కంపోజిషన్ చేస్తానని కీరవాణి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube