కుమారుడితో క‌లిసి రెండో సారి ప్లాస్మాదానం చేసిన కీరవాణి!  

mm keeravani and his son donate plasma for second time at kims! mm keeravani, keeravani son, plasma, plasma donation, kims, coronavirus, covid-19, latest news, tollywood news - Telugu @mmkeeravaani, Coronavirus, Covid-19, Keeravani Son, Kims, Latest News, Mm Keeravani, Plasma, Plasma Donation, Tollywood News

ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ క‌ల‌వ‌ర పెడుతోన్న సంగ‌తి తెలిసిందే.ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో జీవం పోసుకున్న అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.

TeluguStop.com - Mm Keeravani And His Son Donate Plasma For Second Time At Kims

చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు అతి త‌క్కువ స‌మ‌యంలోనే వేగంగా వ్యాప్తిచెందింది.ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.

ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.ఎన్నో కుటుంబాల‌ను ఈ క‌రోనా రోడ్డున ప‌డేస్తుంది.
అయితే క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న వేళ.ఎక్క‌డ చూసినా ప్లాస్మా దానం అనే మాట వినిపిస్తోంది.క‌రోనా బారిన ప‌డ్డ‌ పేషెంట్ల పాలిట ప్లాస్మా ఒక సంజీవనిలా మారింది అన‌డంలో సందేహం లేదు.క‌రోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయ‌డం వ‌ల్ల‌.

TeluguStop.com - కుమారుడితో క‌లిసి రెండో సారి ప్లాస్మాదానం చేసిన కీరవాణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

క‌రోనా రోగుల‌ను ప్రాణాపాయం నుండి బయటపడేవ‌చ్చు.ఈ క్ర‌మంలోనే చాలా మంది ప్లాస్మా డోనేట్ చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు.

అయితే తాజాగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం.కీరవాణి.కుమారుడితో క‌లిసి రెండో సారి ప్లాస్మా దానం చేశారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలుపుతూ.ప్లాస్మా డొనేట్‌ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు.`మా రక్తంలో యాంటీబాడీలు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని డాక్ట‌ర్లు గుర్తించారు.ఈ క్ర‌మంలోనే నేను, నా కుమారుడు కిమ్స్‌లో రెండోసారి ప్లాస్మా డొనేట్ చేశాము.

ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మా డొనేట్ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు` అని కీర‌వాణి ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం కీర‌వాణి చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆయ‌న మంచి మ‌న‌సుకు ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.కాగా, సెప్టెంబ‌ర్ 1న కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు భైరవతో కలిసి కిమ్స్‌ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్‌ వింగ్‌లో ప్లాస్మా దానం చేశారు.

ఇది జ‌రిగిన ఇర‌వై రోజుల్లోనే మ‌రోసారి కీరవాణి, ఆయ‌న త‌న‌యుడు ప్లాస్మా దానం చేయ‌డం విశేషం.

#Coronavirus #COVID-19 #Keeravani Son #Plasma Donation #@mmkeeravaani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mm Keeravani And His Son Donate Plasma For Second Time At Kims Related Telugu News,Photos/Pics,Images..