కౌశిక్‌కు ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందే?

హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తున్నది.ఈ క్రమంలోనే స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి పనులను, ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

 Mlc To Kaushik Is There Strong Opposition Coming On Trs-TeluguStop.com

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం సిద్దిపేట నుంచే హుజురాబాద్‌ను పర్యవేక్షిస్తున్నారు.సదరు నియోజకవర్గంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలను గులాబీ గూటికి చేర్చుకుంటున్నారు.

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, స్వర్గం రవి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులను టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేర్చుకున్నారు.తాజాగా ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తి పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేశారు.

 Mlc To Kaushik Is There Strong Opposition Coming On Trs-కౌశిక్‌కు ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రజల నుంచి టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేక వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రతిపక్ష పార్టీలు పాడి కౌశిక్‌ను ఎమ్మెల్సీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమకారులను, టీఆర్ఎస్ సీనియర్ నేతలను పక్కనబెట్టి నిన్నగాక మొన్న వచ్చిన కౌశిక్‌కు ఎలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు.

తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.ఉద్యమ సమయంలో మానుకోటలో, ఇతర చోట్ల టీఆర్ఎస్ నేతలపై దాడులు చేయించిన కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ అడుగుతున్నారు.

అయితే, ఇలా అవసరమైన వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం రాజకీయ లబ్ధి కోసమేనని, హుజురాబాద్‌లో గెలుపు కోసమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Telugu Bjp Party, Comments On Trs, Etala Rajendher, Kaushik Reddy, Koushik, Mlc To Kaushik, Trs, Ts Congress, Ts Poltics-Telugu Political News

ఈ క్రమంలోనే హుజురాబాద్ విక్టరీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నదనేది రాష్ట్రరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారబోతుంది.ఈ బై పోల్ ద్వారా ఇటు ఈటల రాజేందర్ భవిష్యత్తు, అటు అధికార గులాబీ పార్టీ భవిష్యత్తు తేటతెల్లం కానుంది.కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు విన్నింగ్ చాన్సెస్ ఉంటాయని, కచ్చితంగా కొంత ప్రభావం ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

#Ts Poltics #Mlc To Kaushik #Bjp Party #Etala Rajendher #Koushik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు