టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు చేరుకున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత సమావేశం కానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.సీఆర్పీసీ సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ మేరకు నోటీసులపై కేసీఆర్ తో కవిత చర్చించనున్నారు.అనంతరం న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది.
కాగా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు ఈనెల 6న కవిత సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.