బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ( MLC Kavitha )సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) హాజరుపరిచారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ క్రమంలో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ కవితను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal ) తో కలిసి కవిత కుట్ర చేశారని సీబీఐ ఆరోపించింది.
మాగుంట రాఘవ, నిందితుల వాంగ్మూలం ఆధారంగా కవితను అరెస్ట్ చేశామని సీబీఐ పిటిషన్ లో వెల్లడించింది.