టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈనెల 11న సీబీఐ ముందుకు రానున్నారు.11వ తేదీన వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉండాలని సీబీఐ తెలిపింది.ఈ మేరకు ఈ -మెయిల్ ద్వారా కవితకు అధికారులు సమాచారం ఇచ్చారు.11న ఉదయం 11 గంటలకు కలుస్తామని కవితకు సీబీఐ మెయిల్ చేసింది.షెడ్యూల్ ప్రకారం ఇవాళే కవితను సీబీఐ కలవాల్సి ఉంది.అయితే పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉండలేనని కవిత అధికారులకు తెలిపారు.ఈ క్రమంలో కవిత ప్రతిపాదించిన నాలుగు తేదీల్లో 11న కలిసేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది.
ఈనెల 11న సీబీఐ ముందుకు ఎమ్మెల్సీ కవిత
MLC Kavita Before CBI On 11th Of This Month